రేవంత్ రెడ్డికి బాబు రాసిన లేఖ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ికి పొగురు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై అసక్తి నెలకొంది.

 తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రెండు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు కోసం కూర్చుని మాట్లాడుకుందాం రా అంటూ  జూలై 1వ తేదీన రాసిన లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయంగా మారింది.


 తన లేఖలో ముఖ్యమంత్రి నాయుడు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు.  రేవంత్ రెడ్డి  అంకితభావాన్ని   నాయకత్వాన్ని కొనియాడారు. రేవంత్ రెడ్డి  రాష్ట్రాన్ని గణనీయమైన   పురోభివద్ది వైపు తీసుకు వెళ్తున్నాడని ప్రశంసించారు.


అదే విదంగా రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాల మద్య పరస్పర సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. 

“ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 సంవత్సరాలు గడిచిందని  పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఉత్పన్నమయిన సమస్యల గురించి గతంలో  చాలా చర్చలు జరిగాయని రెండు రాష్ట్రాల సంక్షేమం కోసం అట్లాగే  పురోభివృద్దికి చర్చలు చాలా కీలకం” అని బాబు లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మద్య సమస్యలపై సామరస్యపూర్వకమైన పరిష్కారాలు అవసరమని అన్నారు.

ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, జూలై 6వ తేదీ, శనివారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డితో ముఖాముఖి సమావేశం కావాలని నాయుడు ప్రతిపాదించారు. 

ఈ సమావేశం వల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా రెండు రాష్ట్రాలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాల దిశగా కృషి చేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

--ఎండ్స్





రేవంత్ రెడ్డి స్పందన కోసం ఎదురుచూస్తున్న నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై తెలంగామ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఏమిటనేది ఆసక్తిగా మారింది. అయితే ఇంత వరకు రేవంత్ రెడ్డి బాబు లేఖపై స్పందించ లేదు. అయన ఆచి తూచి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డికి వ్యక్తి గతంగా అభిమానం గౌరవం మెండుగా ఉన్నా అలనాటి పరిస్థితులకు  నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది.

తెలంగాణ ప్రజలకు  చంద్రబాబు అంటే ఓ రకమైన అభిప్రాయం ఉంది. తెలంగాణ విషయంలో బాబు మాయలోడనే విమర్శలు ఉన్నాయి. 


 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు