*_వెన్ను చూపని ధైర్యం.._*
*_దాని పేరే శౌర్యం!_*
👨🏽✈️👨🏽✈️👨🏽✈️👨🏽✈️👨🏽✈️👨🏽✈️👨🏽✈️
_కార్గిల్ వీరులకు జోహార్లు_
🙏💐🙏💐🙏💐🙏
అదెంత కుట్ర..
సరిహద్దుల వెంబడి
దురాక్రమణ..
మనం ఎంత శాంతమైనా
మారని దాయాది బుద్ధి..
పొరుగునే పొంచి ఉండి
దొంగదెబ్బ తీసే దుర్మార్గం..
*_పాకిస్తాన్ నైజం_*
*_మారనే మారదన్నది నిజం!_*
ఎన్ని ప్రయత్నాలు..
శాంతి కోసం
ఎన్నెన్ని ఒడంబడికలు..
ఇన్ని జరిగినా
*_మోగుతూనే ఉన్నాయి_*
*_ప్రమాద ఘంటికలు..!_*
పక్కనే పొంచి ఉండే పాము..
మునుపు చావుదెబ్బ తిన్నా
మారని వక్రబుద్ధి..
భూతల స్వర్గం కాశ్మీరంపై
తీరని కాంక్ష..
దాటేస్తుంది ఆంక్ష..
హద్దు మీరి..సరిహద్దు దాటి
చొరబడ్డాయి మూకలు..
జాడిస్తూ తోకలు..
శాంతమే మతమై..
ప్రశాంతతే సమ్మతమై...
సహనానికే పరిమితమై
వేచి చూసిన కర్మభూమి..
చర్చలతో పరిష్కారం
కోరిన వేదభూమి..
అటు దౌర్జన్యం పెచ్చుమీరుతుంటే..
కయ్యానికే
కాలు దువ్వుతుంటే శత్రువు..
విదిలించింది జూలు..
ఆపరేషన్ బద్రికి ప్రతిగా
*_ఆపరేషన్ విజయ్.._*
*_అదే అదే మన దిగ్విజయ్...!_*
నిలువెల్లా వణికించే చలిలో
వెన్ను చూపని జవాను..
అరవై రోజుల భీకర పోరు..
*సత్యమేవ జయతే..*
తోక ముడిచిన శత్రువు..
కార్గిల్ పోరులో
*_ధర్మానిదే విజయం.._*
జై జావాన్ అని మురిసింది
భారతావని..
*_జై జై భారత్ ఆంటూ_*
*_పొగిడింది అవని..!_*
ఎందరో జవానుల వీరమరణం..
ఉరకలెత్తిన ఆవేశం..
శత్రువు వశం..
మళ్లీ ప్రతిష్టిస్తే
భారతీయ పతాకం..
మొత్తం జాతి పరవశం...!
ఈ సమరంలో అంతిమంగా
దర్మానిదే విజయం..!
సైనికుల శౌర్యానికి ప్రతీక
మన విజయగీతిక...
ఆ మాటున
అయిదువందల సైనికుల
మరణం మిగిల్చిన
విషాద చారిక..
భరతజాతి విజయం..
*_అమరవీరుల రుధిరంతో లిఖించిన చరిత్ర.._*
ఇరవై నాలుగేళ్లకు మునుపు..
ఇదే రోజున ఇంతటి గెలుపు..
భారత ఇతిహాసంలో
మరో సువర్ణ అధ్యాయం..
చదివినా..విన్నా..
పులకిస్తూనే ఉంటుంది
ప్రతి భారతీయుని మేను
ప్రతి పర్యాయం..!
************************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
_జర్నలిస్ట్_
విజయనగరం
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box