ప్రజావాణి దరఖాస్తులు త్వరిత గతిన పరిష్కరించాలి -కెలెక్టర్ దివాకర టి.ఎస్

 


ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్  దివాకర టి. ఎస్.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అధికారులను ఆదేశించారు.

సోమవారం కలేక్టరేట్  సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలు రెవిన్యూ శాఖ కు సంబంధించినవి (29 ), కోర్టు కేసుకు సంబంధించినవి(5), ఉద్యోగాల కొరకు (6)  ఇతర శాఖలకు సంబంధించినవి ( 23 ) మొత్తం (63) దరఖాస్తులను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.,  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి లతో కలిసి స్వీకరించారు. 

ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా  పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని,

అర్జిదారులు కార్యాలయాలకు తరుచుగా రాకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని అర్జీలను వెంటనే 

కలెక్టర్  పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, డిఆర్ డిఓ శ్రీనివాస్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, డి డబ్లూఓ స్వర్ణలత లీనినా, ఎల్ డి ఎం రాజ్ కుమార్, 

సి పి ఓ ప్రకాష్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు