హనుమకొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి

 


హనుమకొండ పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో సిపి ముచ్చటించారు. అనంతరం సిసి కెమెరాల పనితీరు, సిసిటీఎన్ఎస్ రిసెప్షన్ పనితీరు ను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రజలతో బాధ్యతయుతంగా వ్యవహారించాలని, విధి నిర్వహణ అలసత్వం వహించిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, సిబ్బంది కి సూచించారు.

బాధితులకు స్వాంతన అందించాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 

లైంగిక దాడులకు గురైన బాధితులకు స్వాంతన అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రం పై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భరోసా కేంద్రం నాల్గవ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా పోలీస్ కమిషనర్ రంగంపేట్ లోని భరోసా కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వారోత్సవ వేడుకలకు హాజరయి భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందితో కల్సి కేక్ కట్ చేశారు. అనంతరం భరోసా కేంద్రం తీరును తెలుసుకోవడంతో పాటు భరోసా కేంద్రం పరిసరాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా బాధితులకు సిపి చేతుల మీదుగా ప్రభుత్వం మంజూరు చేసిన నష్ట పరిహారం చెక్కులు, కుట్టు మిషన్లుఅందజేశారు. అనంతరం షీ టీం పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ సందర్శించి ఇక్కడ సిబ్బంది పనితీరు ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం భరోసా కేంద్రం ఇన్స్ స్పెక్టర్ సువర్ణ, షీ టీం ఇన్స్ స్పెక్టర్ సుజాత తో పాటు భరోసా, షీ టీం విభాగాలకు చెందిన ఎస్. ఐ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు