సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట మోసం - లక్షల్లో వసూలు

 


నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు 

చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్‌ నేరాలు


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ  ఇంజనీరింగ్ చేసిన నిరుద్యో గుల నుండి లక్షలు వసూలు చేసి మోసం చేసిన  సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.


 *ఈ సైబర్‌ కేటుగాడి నుండి పోలీసులు సుమారు రెండు లక్షల రూపాయలను  స్వాధీనం చేసుకున్నారు.*

 ఈ అరెస్టుకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ విభాగం ఎసిపి విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. అంద్రప్రదేశ్‌ ఏలూరు జిల్లా,చట్రాయి మండలం, చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ(28) యం.బి.ఏ పట్టా అందుకున్న నిందితుడు కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో ఆ తర్వాత  జల్సాలకు అలవాటు పడ్డాడు. 

జల్సాల కోసం  సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన వున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని వెబ్‌ సైట్లను వేదికగా ఎంచుకున్నాడు. ఈ వెబ్‌సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సంబంధించిన సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి సంబంధిత నిరుద్యోగులకు బ్యాక్‌ డోర్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగఅవకాశాలు కల్పించడం జరుగుతుందని వారి ఫోన్లకు సంక్షిప్త సమాచారం  పంపించేవాడు. ఇలాంటి మేసేజ్‌లకు స్పందించే నిరుద్యోగుల నుండి ఈ సైబర్‌ నేరగాడు ఇంటర్యూ,పరీక్షలు, ట్రైనింగ్‌ అంటూ  నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తా నంటూ నిరుద్యోగుల నుండి నిందితుడు లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడేవాడు.   ఇదే తరహలో నిందితుడు హనుమకొండ ప్రాంతంలోని ఓ నిరుద్యోగి నుండి సూమారు మూడు లక్షలకుపై డబ్బులు వసూలు చేసి ఫోన్‌ స్వీచ్‌ఆఫ్‌ చేయడంతో భాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి చివరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించి కేసు నమోదు చేసారు.  పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా  అదేశాల మేరకు సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు బృందం సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నిందితున్ని గుర్తించి అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూమారు 35 మంది నిరుద్యోగుల నుండి సూమారు 45 లక్షల రూపాయలను వసూళ్ళు చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు.

 వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ క్రైమ్స్‌ విభాగం ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి అతి కొద్ది సమయంలో కేసు నమోదు చేసి నిందితుడు పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ రవి, ఎస్‌.ఐలు శివ, చరణ్‌ కానిస్టేబుళ్ళు ఆంజనేయులు, మహేందర్‌,రాజు, సంపత్‌లను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.


---ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు