పెన్షనర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసి మోమోరాండం
పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అంద చేసింది. జేఏసి అధ్యక్షులు పులి సారంగ పాణి, కార్యదర్శి డాక్టర్ డాక్టర్ బి. మల్లారెడ్డి కార్యవర్గ సబ్యులు కలెక్టర్లను కలిసి సమస్యలు విన్నవించి మెమోరాండం అంద జేశారు.
బకాయి పడ్డ నాలుగు కరువు భత్యపు వాయిదాలు, EHS స్కీం రిటైర్డ్ ఉద్యోగులందరికి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వర్తింప చేసే విదంగా మెడికల్ రీఇమ్బెర్స్ మెంట్ త్వరిత గతిన చెల్లించాలని, పెన్సషనర్స్ కు కమ్యూటేషన్ విలువ తిరిగి చెల్లించే కాలాన్ని 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు కుదించాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా జేఏసి అధ్యక్ష కార్యదర్శులు పులి సారంగపాణి, డాక్టర్ బి. మల్లారెడ్డి మాట్లాడుతూ అపరిష్కృత సమస్యలపై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
తమస్యలపై Telangana Govt. Pensioner's Joint Action Committee జూన్ 13వ తేదీన జనరల్ బాడీ సమావేశం నిర్వహించి వివిద సమస్యలపై చర్చించి తీర్మాణాలు చేసిందని అట్లాగే జూన్ 26 వ తేదీన -2024 నాడు కార్యవర్గ సమావేశం జరిపి ఉద్యమ కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 15-7-2024 సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాన్నము 1.00 గంటల మధ్య కాలం లో నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించాలని జూన్ 30 న మంగళవారం ఉదయం 11 గంటలనుండి మధ్యాన్నము 3 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల మౌన దీక్ష నిర్వహించాలని తీర్మాణించామని తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box