కిట్స్ వరంగల్ లో ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్ ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం

 


హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ కు కిట్స్  వరంగల్ లో ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్  ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం 

కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ (కిట్స్‌డబ్ల్యు)  ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్ కింద పాఠశాల పిల్లల కోసం ఆదివారం ఓపెన్ డే స్కూల్ ప్రో గ్రాం నిర్వహించారు.

  ఈ కార్యక్రమంలో  85 మంది పాఠశాల విద్యార్థులు,15 మంది ఉపాధ్యాయులు  పాల్గొన్నారు. ఈ ప్రాక్టికల్ మరియు ఇంటరాక్టివ్ సెషన్‌లలో, ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా స్ట్రక్చర్‌ల ఆధారంగా వివిధ పరిశోధనలు ఇంకా అభివృద్ధి సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరించారని కిట్స్  కిట్స్తె కాలేజ్లి ప్రిన్సిపాల్పా అశోక రెడ్డి తెలిపారు.


ఈ సందర్భంగా ఐ స్క్వేర్ ఆర్‌ఈ, ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ కో ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె. రాజా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమను తాము ఇన్నోవేటర్లుగా మార్చుకోవాలని సూచించారు. స్వీయ ప్రేరణ విజయానికి అత్యంత కీలకమని అన్నారు.

 రాజ్యసభ  మాజీ సభ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి  పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, శ వి. సతీష్ కుమార్ స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులలో జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించడానికి  నిర్వహించినందుకు కిట్స్ వరంగల్ సెయిల్ విద్యార్థి మరియు  అధ్యాపక బృందాన్ని అభినందించారు.



 ఈ కార్యక్రమంలో ఎఐసిటిఇ ఐడియా ల్యాబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వి.రాజు రెడ్డి, డాక్టర్. యం డి. సమీర్, డాక్టర్ జి గణేష్ డాక్టర్ పి ఎస్ ఎస్ మూర్తి, స్టూడెంట్ అలయన్స్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ (సెయిల్) కింద డాక్టర్ ఎ దేవరాజు చంద్రమౌళి మరియు సుమంత్ కుమార్ బి టెక్ విద్యార్థి కార్యకర్తలతో పాటు ఫ్యాకల్టీ రీసెర్చ్ పర్సన్‌లుగా ఉన్నారు.  సెయిల్ ప్రెసిడెంట్ రెడ్డిమ, వీపీ అభినయ్, మోక్షిత్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

కిట్స్‌డబ్ల్యు  వివిధ విభాగాల డీన్లు, వివిధ విభాగాల హెడ్స్, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి, ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

---ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు