ఆయిల్ ఫామ్ రైతుల అభివృద్ధికి కృషి -జంగా రాఘవ రెడ్డి



             డిసిసిబి బ్యాంకును ఎలా అభివృద్ధి చేశా నో రైతులకు,రైతు కూలీలకు ఎలా సహాయం చేశా నో అలాగే ఆయిల్ ఫామ్ రైతులు కు కూడా సహాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి గారు అన్నారు.

       ఆదివారం హనుమకొండ మండలం టేకులగూడెం గ్రామంలో రాఘవ రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ను నేను కూడా సాగు చేస్తున్నానని వరికంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు.ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు రూపాయలు 1 లక్ష50 వేల నుంచి 1 లక్ష 80 వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఏవైనా ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తే మేము రైతులకు అండగా ఉంటామని తెలిపారు.రైతులకు రవాణా, స్టోరేజీ మరియు గిట్టుబాటు ధర వచ్చేట్లు చూస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలోనే ఉన్నతంగా తయారు చేస్తామని అన్నారు.ఈ ఆయిల్ ఫామ్ పంటకు కోతుల బెడద గానీ దొంగల బెడదని ఉండదని అన్నారు.

       ఆయిల్ ఫామ్ ను నాలుగు సంవత్సరాలు కష్టపడి పెంచితే తర్వాత సంవత్సరం నుంచి ఆదాయం వస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ పంటలకు వాడే డ్రిప్ ఇరిగేషన్ కి సేల్స్ టాక్స్ ను రద్దు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. మా దగ్గర 30 లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలు ఉన్నట్లు, ఇప్పుడున్న 1000 కోట్ల టర్నోవర్ ను సంవత్సర కాలంలో 2000 కోట్లకు చేరేందుకు కృషి చేస్తానని అన్నారు.రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని తప్పకుండా చేస్తామని అన్నారు. ప్రతి జిల్లాలో మండలంలో ఆయిల్ ఫామ్ పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు