రాజకీయాలకు విరమణ ఉండదు - మంత్రి పొన్నం ప్రభాకర్

 


 నిత్యం ప్రజాసేవ లో ఉన్నవారికే మళ్ళీ అవకాశాలు.

రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం - మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 


హుస్నాబాద్,జూలై 4,2024: గత సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులైన ఎంపిపి ,ఎంపీటీసీ , జడ్పీటీసీ లకు ఎల్క తుర్తి , భీమదేవరపల్లి మండలాల్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన  ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. 


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో వీడ్కోలు ఉండదని నిత్యం ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో ఉండేవారికి మళ్ళీ అవకాశాలు వస్తాయనీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలు , అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. పదవి పూర్తైన ప్రజల పక్షాన పోరాడితే ప్రజలే గుర్తించి మీకు సర్పంచ్ ,ఎంపిటిసి ,జడ్పీటిసి లుగా అవకాశం ఇస్తారని తెలిపారు. ప్రజా పరిషత్ సభ్యుల్లో మెజారిటీ మహిళా నేతలే ఉన్నారని వారంతా ఉద్దండ రాజకీయ నేతలుగా ఎదిగారని అభినందించారు. మహిళలకు అధిక సంఖ్యలో సీట్లు వచ్చేలా సోనియా గాంధీ గారు చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రివర్వేషన్లు ఇవ్వడం వల్లే సాధ్యమైందని తెలిపారు  



హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మీ గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ కు ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ లలో పెట్టారని తెలిపారు. గౌరవెల్లి, దేవాదుల ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తామన్నారు. విద్య,వైద్యం  , వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తానని నిరుద్యోగ సమస్య లేకుండా ఉండడానికి హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామని 8 వేల మంది హాజరవగా 5 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 


అనంతరం వన మహోత్సవం లో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మొక్కలు నాటారు.నియోజకవర్గంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్ , ఎంపిపి లు ,జడ్పీటిసి, ఎంపీటీసీ , స్పెషల్ ఆఫీసర్లు ,ఆర్డీవోలు ఎంపీడీవోలు ,ఏమర్వోలు ,మాజీ సర్పంచ్ లు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

---ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు