గట్టమ్మ ఏకో పార్క్ పనులను పరిశీలించిన :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

 


 గట్టమ్మ ఏకో పార్క్ లో జరుతున్న  పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్.పరిశీలించారు.

గురువారం ఎర్రి గట్టమ్మ వద్ద 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఏకో పార్క్ లో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఏకో పార్క్ పనుల వివరాలను, వన మహోత్సవం కార్యక్రమంలో పార్క్ లో ఒకే రోజు  10 వేల మొక్కలను నాటే కార్యక్రమ వివరాలను, ప్లాంటేషన్ వివరాలను తదితర అంశాలను జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఘట్టమ ఎకో పార్క్ పనులను వేగవంతం చేయాలని ప్రజాదరణ పొందే విధంగా సుందరికరించాలని అన్నారు.

వనమహోత్సవం కింద నాటే ప్రతి మొక్క బతకాటని ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని,  మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని, 

గుంతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మొక్కల ఎంపిక,  భూమి సిద్ధం,  మొక్క ఎంపికతో పాటు, ఎరువు వేయడం, మొక్కలు నాటిన తర్వాత వాటికి నీటిని పోయడం, సంరక్షించడం, వాచర్ ఏర్పాటు, మొక్కల సంరక్షణ వంటి వాటిపట్ల జాగ్రత్తలు  తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం పై, అలాగే మొక్కల సంరక్షణ విషయమై అందరికీ అవగాహన ఉండాలన్నారు.

ఎక్కడ  అటవీ భూములు అన్యాక్రాంతం కావడానికి అవకాశం ఇవ్వకూడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ , ములుగు తహసిల్దార్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు