*_ఆ స్వరం..అబ్బురం..!_*
_______________________
_ముఖేష్ జయంతి_
22.07.1923
_______________________
(_ఎలిశెట్టి సురేష్ కుమార్_)
9948546286
🎤🎤🎤🎤🎤🎤🎤🎤
ముక్కుతో పాడతాడనే ఏమో ముఖేష్ అయ్యాడని
చిన్నప్పుడు అనుకుంటే..
సైగలే అచ్చెరువొందేలా
అచ్చంగా ఆయనలాగే
పాడేసాడు..
అంతలో వరస మార్చి
పాడితే ఆ ముఖేష్ స్వరమే
రాజ్ కపూర్..దిలీప్ కుమార్
మనోజ్ కుమార్..
ఇంకెందరికో అయింది
సర్వస్వం..
ఒక్కోరిదీ ఒక్కో రకం అభినయం..
అందరికీ తగ్గట్టుగా ముఖేష్
బహుస్వరాభినయం...
చేస్తూ ఆయా హీరోలకు సమన్యాయం..!
సరే..రాజ్ కపూర్..ముఖేష్
ఒకరికోసం ఒకరు..
ఆ మోమున
గుండెలు పిండేసే వేదన..
ఈ గొంతులో
గుండెలు పగిలే రోదన..
_పెహలా గంటా బచ్ పన్.._
_దూస్రీ జవానీ.._
_తీస్రీ బుఢా పే.._
_ఔర్ ఇస్కే బాద్.._
_మా నహీ..బాప్ నహీ.._
_బేటా నహీ..బేటీ నహీ_
_ఊపర్ హీ నహీ నీచే భీ_
మూడున్నర గంటల సినిమా
మూడు ఎపిసోడ్లు..
మూడు విరామాలు..
జనాన్ని కపూర్ కూర్చోబెట్టడం
ముఖేష్ పాటల మంత్రమే..
_జీనా యాహా మర్నా యహా_
_ఇస్కే సివా జానా కహా.._
కపూర్ జోకరైనా...
భగ్నప్రేమికుడైనా
ముఖేష్ పాడితేనే
జనాలు ఖుష్ ఖుష్..!
_ఏ కౌన్ హస్తా హై_
_ఫూలోంసే చుప్ కర్.._
శ్రోతలను ఊహాలోకాల్లోకి
తీసుకుపోయే మత్తు..
_కభీ కభీ మెరె దిల్ మే_
_ఖయాల్ ఆతా హై..._
ఇత్నీ సుందర్ కౌన్ గాసక్తా హై
ముఖేష్ జీ కే సివా
కభీభీ వారేవా..!
_కయి బార్ యూహి దేఖా హై_
అవార్డు తెచ్చిపెట్టిన రజనీగంధ..
సుస్వర సౌగంధ..
స్వర గాంధర్వ...
_ఎక్ ప్యార్ క నగ్మా హై_
మనోజ్ కుమార్ షోర్.. ముక్కుతో
ఆయన మాట
ముఖస్తా ముఖేష్ పాట..
ఆరోజుల్లో
అభిమానులకి కంఠస్తా..!
పదమూడు శతకాల
పాటల ప్రయాణం..
ఆ పాటల కోసమే
విదేశానికి పయనం..
పాడక మునుపే
గుండె ఆగింది...
పాడాలి..పాడాలని కొట్టుకుంటూ..
_జానే కహా గయే వొదిన్.._
_కెహతే ధె తేరీ రాహ్ మే.._
_నజరొంకి హం భిచాయెంగే.._
ఆయన వెళ్ళినా
పాట ఆగిపోలేదు
కచేరీ ఆగలేదు..
జనకుని పాటలను తనయునితో
కలిసి పాడి
రాగాల అశ్రువులతో వేదికను
తడిపేసారు లతాజీ..
ముఖేష్ భయ్యాకి
కన్నీటి నివాళి...
ముగిసి ఆ గానగంధర్వుని
పాటల వ్యాహ్యాళి...!
************************
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box