100 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉంటున్న కవిత
తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలింపు
దీన్ దయాల్ ఆసుపత్రిలో కవితకు చికిత్స
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా కవిత అస్వస్తతో ఉన్నారు. జైళులో మందులు వాడినప్పటికి తగ్గ లేదు. టెంపరేచర్ బాగా పెరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించి, చికిత్స చేస్తున్నారు. తీహార్ జైల్లో కవిత 100 రోజులకు పైగా ఉంటున్నారు. కవిత అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు జైళు అధికారులు తెలియజేయాల్సి ఉంది. ఆమె తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్టు కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చారని తెల్సింది. కవితను లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box