తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలి - రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

 ఇద్దరు ముఖ్యమంత్రుల భేటి సందర్భంగా ఈ అంశం ఎజెండాలో చేర్చాలని కోరిన తుమ్మల నాగేశ్వర్ రావు


 ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు తుమ్మల నాగశ్వర్  రావు బాగా క్లోజ్. ఆయన మంత్రి వర్గంలో చాలా కాలం సమహచర మంత్రి కూడ. రెండు రాష్ట్రాలు వేరు పడ్డ తర్వాత రాజకీయ పరిస్థితులు చాలా మారి పోయాయి.  ఈ నేపద్యంలో శనివారం ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇతర మంత్రి వర్గ సహచరులు ఉభయ రాష్ట్రాల విభజన సనస్యలపై మాట్లాడారు.

 ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఓ లేఖ రాసారు. ఇది మంచి ఉద్దేశంతోనే రాసారు. తెలంగాణ వారికి అవసరం కూడ. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం నుండి వేలాది మంది భక్తులు నిత్యం  వెళ్తుంటారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతి నిధుల సిఫార్సు లేఖలు అనుమతించడంలేదు. ఎవరైనా సిఫార్సు లేఖలు ఇస్తే వాటిని  చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఈ పదేల్ల కాలంలో ఇదే జరిగింది.  

ఇదే విషయంపై తుమ్మల నాగేశ్వర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజా ప్రనిదుల సిఫార్సు లేఖలు ఆమోదించేలా ఎపి సిఎం చంద్రబాబును అడగమంటూ లేఖ రాసారు.

....తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల లేఖ సాారాంశం.

కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు వసతి మరియు దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీ.టీ. డి అధికారులు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖలో కోరారు.

 

...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు తో భేటీలో  తిరుమల దర్శనంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల పై నిర్ణయం తీసుకునే విధంగా  చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ తుమ్మల నాగేశ్వర్ రావు లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది.

ఇరు ముఖ్యమంత్రుల భేటిలో కొద్ది మంది మంత్రులకు మాత్రమే అనకాసం లభించింది. తుమ్మల నాగేశ్వర్ రావుకు చంద్రబాబు నాయుడుకు బాగా సన్నిహితులని అందరికి తెల్సు. కాని ఆయన నేరుగా ఈ సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లేంత చొరవ తీసుకోకుండా రేవంత్ రెడ్డికి లేఖ రాయడం చర్చకు కారణ మైంది.  

ఆ ఏడు మండలాలపై కూడ తుమ్మల లేఖ...

రాష్ట్ర విభజన సందర్భంగా ఏడు మండలాలను ఎపీలో బలవంతంగా విలీన చేసిన విషయంలో కూడ తుమ్మల నాగేశ్వర్ రావు ఇద్దరు సిఎం లు భేటి సందర్భంగా గుర్తు చేసారు,  ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

----ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు