వర్షాలు, వరదలు తగ్గేవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి-మంత్రి సీతక్క



వర్షాలు, వరదలు తగ్గేవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అన్ని ఏర్పాట్లు చేయాలి.


నీటి ప్రవాహానికి కొట్టుకపోయిన బ్రిడ్జిల్లా వద్ద రవాణా కోసం తాత్కాలిక మరమత్తులు చేయాలి.


గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి.


ప్రజలకు కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నాం.


ములుగు మండలం లోని రాళ్ళ వాగు, మెడివాగు, గోవిందరావు పేట మండలం లోని దయ్యాల వాగు, గుండ్ల వాగు,   తాడ్వాయి మండలంలోని,   నార్లాపూర్ చింతల క్రాస్ జంపన్న వాగు, వాజేడు మండలం లోని పూసుర్ బిడ్జీ 

వరద ప్రవాహాన్ని పర్శిలించిన మంత్రి .


అధికారులు సహాయక చర్యలో నిమగ్నం.


ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

      

మంత్రి సీతక్క వెల్లడి.


****


జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వర్షాలు, వరదలు  తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు గ్రామ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. 


జిల్లాలో ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గోదావరి పర్యటక ప్రాంతాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం  కాకుండా చర్యలు తీసుకోవాలని 

జిల్లా అధికారులను ఆదేశించారు. 


సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ డాక్టర్ శబరిష్ లతో కలిసి మంత్రి సీతక్క ములుగు మండలం లోని రాళ్ళ వాగు, మెడివాగు, గోవిందరావు పేట మండలం లోని దయ్యాల వాగు, గుండ్ల వాగు,   తాడ్వాయి మండలంలోని,   నార్లాపూర్ చింతల క్రాస్ జంపన్న వాగు, వాజేడు మండలం లోని పూసుర్ బిడ్జీ 

వరద ప్రవాహాన్ని పర్శిలించి అధికారులకు తగు సూచనలు చేశారు.


ప్రాజెక్టు నగర్, వెంగ్లాపూర్

గ్రామస్తులను కలసి వరదతొ  అప్రమత్త ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

     

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొట్టుకపోయిన 

బ్రిడ్జిల వద్ద రవాణా వ్యవస్థను కొనసాగించడానికి తాత్కాలిక మరమ్మతులు చేసి  పునరుద్ధరించాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి చెరువులు సరస్సులోకి వెళ్లకుండా  చూడాలని, రోడ్లపై నీటి ప్రవాహం అధికంగా ఉన్న పక్షంలో రవాణా నిలిపివేసి ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేయాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఏ గ్రామమైన జలదిగ్బంధంలో ఉండిపోయిన  సందర్భం వస్తే ఆ గ్రామ ప్రజలను తక్షణమే సురక్ష ప్రాంతాలకు తరలించడానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడానికి చొరవ చూపాలని అన్నారు. జిల్లాలోని జలపాతాల వద్ద నీటిలో దిగకుండా కట్టుదిట్టం చేయడమే కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఏటూరు నాగారం లోని ఐటీడీఏ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఆపద సమయంలో ఆ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని అన్నారు. 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకి రాకూడదని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తామని, వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని,   దొడ్ల కొండాయి జంపన్న వాగు పై 9.30 కోట్ల తొ   నూతన వంతెన, ఐదు కోట్ల రూపాయలతో బొగ్గుల వాగు పై నూతన వంతెన  నిర్మాణం కోసం ప్రభుత్వం  నిధులు మంజూరు చేసిందని  ఎన్నికల కోడ్ కారణంగా పనులలో జ్యాప్యం కలిగిందని  మంత్రి పేర్కొన్నారు. 

గతం లో జంపన్నవాగు వరద 

ఉధృతి పెరగడంతో లో లెవెల్ 

వంతెన పై వరదనీరు చేయడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని త్వరలోనే దీర్ఘకాలికంగా సమస్యలను పరిష్కరించడం కోసం  హై లెవెల్ వంతెనకు ప్రతిపాదనలు పంపించామని, వచ్చే జాతర వరకు హై లెవెల్ వంతల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

సమ్మక్క సారమ్మ దీవెనలతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని , అధికార యంత్రాంగం వంతెనలు ఉన్నచోట 

ఒక ప్రత్యేక అధికారిని. కేటాయిస్తున్నామని వారి ద్వారా వాగుల ఉధృతి వెంట వెంటనే సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందని, గుండ్ల వాగు నుంచి జంపన్న వాగు వరద ఉధృతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని , వరద ఉధృతి ప్రవాహం దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందని  దానిద్వారా ఎన్ని గ్రామాలకు ఇబ్బందులు ఎదురవుతాయని  ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలలో ఉన్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వచ్చే వర్షాకాలం నాటికి వాటిని అధిగమిస్తామని , గోదావరి కరకట్ట నిర్మాణం నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్నామని , త్వరలో  మంగపేట మండల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని , ములుగు జిల్లాకు అనుకూల పరిస్థితులతో పాటు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని , ఒకవైపు జంపన్న వాగు , గోదావరి నది వరద ఉధృతి జిల్లాపై ప్రభావం చూపిస్తుందని , గోదావరి నది వరద పెరగడంతో వరద నీరు జంపన్న వాగులోకి చేరుతుందని , మరోవైపు జంపన్న వాగు వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుందని ,2022 సంవత్సరంలో గోదావరి నది వరద, 2023 లో జంపన్న వాగు వరదలు వచ్చాయని  , గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులను అప్రమత్తం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో గోదావరి నది వరదతో అదే విధంగా జంపన్నవాగు వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఉద్దేశంతో జంపన్న వాగు పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా ఒక అధికార బృందాన్ని ఏర్పాటు చేశామని, జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో రెస్పాన్స్ ఫోర్స్ , 

ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతి రెండు గంటలకు జంపన్న వాగు వరద ఉధృతి లెవెల్స్ పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, ఆగస్టు 31 తేదీ  అధికార యంత్రాంగం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.


లోతట్టు ప్రాంతాలలో ప్రజలను ఎత్తు ప్రదేశాలకు తరలించడం ,  వారికి రెండు మాసాలకు  అవసరమయ్యే రేషన్ తో ఇతర సామాగ్రిని పంపించడం జరిగిందని ,  వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని , ములుగు జిల్లా వ్యాప్తంగా 170 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఇంజనీరింగ్ అధికారులు,మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు