గేట్ పరీక్షలో అల్ ఇండియా ర్యాంక్ సాధించిన విద్యార్థిని ని సన్మంచిన ......రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
సోమవారం ఇంచర్ లలో గేట్ పరీక్షలో ఆల్ ఇండియా 104 ర్యాంకు సాధించిన తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సంకే పల్లవికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తొ కలసి శాలువాతో సత్కరించి లాప్ టాప్ ను అందచేసి అభినందించారు .
ఈ సందర్భంగా కుమారి సంకే పల్లవి మాట్లాడుతూ మంత్రి, కలెక్టర్ గార్ల తో ఈ రోజు వేదిక పై నిలబడి సన్మనిoచుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశనుంచే జీవిత ఆశయం కోసం అహర్నిశలు కృషి చేయాలని, చదువుకు ఏది ఆటంకం రాదని , తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి గేట్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలని నాన్న మరణించినప్పటికీ కుటుంబ సభ్యుl ప్రోత్సాహం, దాతల సహాయం తొ చదివి ర్యాంకు సాధించానని మరెన్నో విజయాలను సాధించాలని జీవిత ఆశయం పట్టుదలతో ముందుకు వెళుతున్నానని ప్రతి విద్యార్థి, విద్యార్థి దశలోనే జీవిత ఆశలను ఎంచుకోవాలని సాధనకు కృషి చేయాలని తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box