జాకారం గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి సీతక్క

 


ములుగు పట్టణం సమీపంలో జాతీయ రహదారిపై జాకారం - గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు వరుద ఉదృతిని పరిశీలించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.


ఆదివారం జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు అక్కడి వరుద ఉదృతిని పరిశీలించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారి పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ రావద్దని 

ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఎవ్వరూ కూడా చాపల వేటకు వెళ్లవద్దని 



జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల లో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించి విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి  సీతక్క  సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు