మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క




మహిళలు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలి :: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.


****


మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.


సోమవారం వాజేడు మండలం, 

చీకుపల్లి గ్రామం లోని బొగత వాటర్ ఫాల్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. లతొ కలసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 

మహిళా శక్తి క్యాంటీన్ లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని , నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని , స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్  ను త్వరలోనే రూపొందిస్తామని , రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటు కు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు

వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

రాష్ట్రం లో ఉన్నా మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో  బ్యాంక్ లీకేజీ ద్వారా అందించడం జరుగుతుందని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడం జరుగుతుందని నూతనమైన  ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మహిళలు మి సేవ కేంద్రాలు , ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఫాంలు , సోలార్ లైట్స్ , అదేవిధంగా పాఠశాలల్లో  ఏక రూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు.



అనంతరం బొగత జలపాతం ను సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, ఓ ఎస్ డి 

మహేష్ బాబా గీతే, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, డి డబ్లూ ఓ స్వర్ణ లత లెనినా, మహిళ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు