ములుగు లో మహిళా శక్తి క్యాంటీన్

 


మంగళవారం ప్రారంభించనున్న మంత్రి సీతక్క 


నేడు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం:: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. 


సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో  నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్ పనులను   జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. 



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి  అనసూయ సీతక్క చే మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్నమని క్యాంటీన్ లో కావాల్సిన వంట సామగ్రి, ఫర్నీచర్, రిఫ్రిజి రేటర్ తొ పాటు ఇతర వస్తువులు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 


ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు