రైతు రుణమాఫీ పై ప్రజాభవన్లో బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
-------------
ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలి.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దని .. రైతులను ఇబ్బంది పెట్టొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు స్పష్టం చేసారు.
ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లు. రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామన్నారు.
గురువారం సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు 6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామన్నారు.
ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని చెప్పారు.
రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని.. ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా 31 వేల కోట్లు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు.
అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళామన్నారు.
ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నాం తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు.
40 లక్షల బ్యాంకు అకౌంట్ల ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.
భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర న్నారు.
కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టర్ లోను ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమన్నారు.
ఈరోజు రైతులు ఎలాగా పండుగ చేసుకుంటున్నారు బ్యాంకర్లు కూడా అదే విధంగా పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాబోతుందని చెప్పారు.
ఈ రాష్ట్ర జిఎస్ జిడిపి లో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది.. రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు.
రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని .. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి
లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలి
రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరుపుకోండి.. విస్తృతంగా ప్రచారం చేయండి
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box