_కూటమి దెబ్బకి_* *_నవగ్రహకూటమి_* *_తట్టుకోలేని ఓటమి..!_

 


*_కూటమి దెబ్బకి_*

*_నవగ్రహకూటమి_*

*_తట్టుకోలేని ఓటమి..!_*


_జాతకాలు తారుమారు_

_అయినా మారని తీరు_


++++++++++++++++++


_ఎక్కడున్నాడు బొత్స సత్యనారాయణ.._


_కోలగట్ల వీరభద్రస్వామీ.._

_ఏది నీ చిరునామా.._


_ఏమైపోయాడు.._

_బొత్స అప్పలనర్సయ్య.._


నిన్న మొన్నటి వరకు వైకాపా సర్కారులో ఒకరు మంత్రి..

ఇంకొకరు శాసనసభ 

డిప్యూటీ స్పీకర్..

వేరొకరు గజపతినగరం

శాసనసభ్యుడు..


వీరు గాక ఇంకా..

బడ్డుకొండ అప్పలనాయుడు..

అలజంగి జోగారావు..

శంబంగి చినప్పలనాయుడు..

పాముల పుష్ప శ్రీవాణి..

రాజన్న దొర..

కడుబండి శ్రీనివాసరావు..


ఈ ఆరుగురూ 2019లో జగన్

వీరవిహారం పుణ్యమాని గెలిచి

అధికారం వెలగబెట్టిన ప్రబుద్ధులే..వీరిలో ఒకసారి పుష్ప శ్రీవాణి..మరోసారి

రాజన్న దొర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒక

వెలుగు వెలిగారు.


మరి జగన్ నిర్వాకమో..

ఆయనతో పాటు ఈ తొమ్మిది మంది మాకేటి..మమ్మల్ని పీకేదెవరు..ప్రజలు ఎర్రోళ్ళు..

మా నేత పడేస్తున్న ఉచిత బిస్కెట్లు తేరగా తిని..మేము ఎలా వ్యవహరించినా..

ఎంత సొమ్ము తిన్నా..

ఎన్ని ఆస్తులు కూడగట్టినా..

ఎలాంటి అక్రమాలకు పాల్పడినా..

ఎన్నెన్ని ఆక్రమణలు చేసినా

పట్టక..పట్టించుకోక మళ్ళీ మొన్న 2024 ఎన్నికల్లో..

తమ అధినేత జగన్మోహన రెడ్డితో పాటు తమకూ పట్టం కట్టేస్తారని భ్రమ పడి తీరా ఫలితం వెలువడేపాటికి బొక్క బోర్లా పడిన బ్యాచి..!


సరే..ఎన్నికల్లో జయాపజయాలు సహజం.

1996..98 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు బొబ్బిలి లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 

అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి

అదృష్టం కలిసొచ్చి మూడోసారి

1999 ఎన్నికల్లో గెలిచి ఆనాటి నుంచి విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు 

బొత్స సత్తిబాబు..!

ఆయన 2004..2009 ఎన్నికల్లో వైఎస్సార్ ప్రభంజనంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఒక వెలుగు వెలిగి మళ్ళీ 2014 ఎన్నికల్లో విభజన వ్యతిరేక పవనాల్లో ఓటమిని రుచి చూశారు.మళ్ళీ 2019 లో జగన్ ప్రభంజనంలో గెలిచి రెండు క్యాబినెట్లలోనూ మంత్రిగా ఉన్నారు.


1989..1994..1999 ఎన్నికల్లో 

ఒకే పార్టీ..ఒకే నియోజకవర్గం..ఒకే ప్రత్యర్థి చేతిలో వరసగా మూడుసార్లు ఓటమి పాలైన కోలగట్ల వీరభద్రస్వామి నాలుగో ప్రయత్నంలో.. అదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయనగరంలో అశోక్ గజపతిరాజుపై గెలుపొందలేదా..మళ్ళీ అదే స్వామి అదే విజయనగరం నుంచి 2009 లో అశోక్ చేతిలో.. మళ్ళీ 2014లో మీసాల గీత చేతిలో ఓటమి చవి చూడలేదా..


ఈ ఇద్దరూ గాక శంబంగి..

అప్పలనర్సయ్య..బడ్డుకొండ..

కడుబండి ఇత్యాదులందరూ

గెలుపోటములు చూసిన వారే.


ఇప్పుడు అసలు కథ..

మొన్న 2024 ఫలితాల తర్వాత..ఈ "నవగ్రహాల"

పరిస్థితి ఎలా ఉందంటే..

జీవితంలో ఇదే మొదటి ఓటమి అన్నట్టు..వాళ్ళ అధినేత మాదిరే..ప్రజలకు అంత ధారపోసాం..ఎంత ఇచ్చాం..

అయినా ఓడించారేం..అన్నట్టు బాధపడిపోతున్నారు.2019 ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం..ఆ తర్వాత అయిదేళ్ల పాటు అనుభవించిన

తిరుగులేని అధికారం..

చెలాయించిన ఆధిపత్యం..

ఇక ఓటమే ఉండదనుకున్నారేమో..

మొన్న తగిలిన గట్టి దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నారు.


అంతర్మధనం లేదు..

ఎందుకు ఓడిపోయాము..

అయిదేళ్ల క్రితం బ్రహ్మరథం పట్టిన ఆంధ్రప్రదేశ్

ప్రజలు అంతలోనే తమ పార్టీని..నాయకున్ని..

తమని ఇంత దారుణంగా

తిప్పికొట్టడానికి కారణం ఏమిటి..లోపం ఎక్కడుంది..

తప్పులు ఎక్కడ జరిగాయి.

కార్యకర్తల పరిస్థితి ఏంటి..

ప్రజల ఆలోచన ఎలా సాగింది.

ఇవేవీ లేవు.


సినిమాలో నాగభూషణం చెప్పినట్టు..రాజకీయ నాయకుడు పరువు పోయినా బ్రతకగలరు..పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా సహింగలడు..పదవి లేకపోతే మాత్రం బ్రతకలేరు..ఇదీ వరస..


పదవి ఉంటేనే ప్రజలు..

పదవి ఉంటేనే కార్యకర్తలు..

పదవి ఉంటేనే జీవితం..

అదే పోతే అన్నీ పోయినట్టే..

అదీ పరిస్థితి..!


జనం కోసమే మనం..

అన్నట్టు కోవిడ్ సమయంలో

కూడా తిరుగుతున్నా.. ప్రజల కోసం..అన్న మనిషి

ఇప్పుడు పత్తా లేడు..


ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటా..

పిలవకపోయినా మీ కష్టంలో

ఆదుకోడానికి సిద్ధం..

ఆ శాల్తీ ఈరోజున

గాయబ్..!


ఒకరు విశాఖలో ఉండి పోతున్నారట.. అసలు ఎప్పటి నుంచో నియోజకవర్గం ప్రజలకు

అందుబాటులో ఉండక..

భారం మొత్తం వేరే వారి మీద వదిలేసి..అంతకు అయిదేళ్ల ముందు కూడా నియోజకవర్గంలో అయిపు

లేక.. మొన్న ఎన్నికల వేళ 

ఉట్టికెగరలేనమ్మ చందాన..

ఒకటికి రెండు నియోజకవర్గాల్లో

సతీపతులు బరిలోకి దిగి

రెండు చోట్ల చెయ్యి కాల్చుకున్న 

వైనం ఒకరిది..


ఇంకొకరేమో..చేసిన ఆక్రమణలకు..అక్రమాలకు

సంజాయిషీ ఇచ్చే ధైర్యం లేక

అమెరికా వెళ్లి కాస్త సద్దుమణిగినాక వస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు వినికిడి.

అయితే భారీ శరీరం కారణంగా

సుదీర్ఘ ప్రయాణం చేయడం కష్టమని తటపటాయిస్తున్నట్టు

టాక్..ఓటమి ఒక బాధ..

ఆడకూతురి చేతిలో 

అని దుగ్ధ.. భారీ మెజార్టీ అని గుండె కోత..ప్రజలు తాను అక్రమాలు చేసినట్టు ఇంతలా నమ్మరా..అని ఇంకా శంక..

దురాగతాలు..భూమి బాగోతాలు..నిండిన గోతాలు..

కార్పొరేషన్లో పరిధికి మించి

పెత్తనం..అన్నీ నేనే అన్నట్టు

అజమాయిషీ..తనకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా అన్నిటిలో

ముడుపులు..

వీటన్నిటికీ సమాధానం 

చెప్పేదెలా..గిలగిలా కొట్టుకుంటున్న అంతరంగం. 

సొంత కులం వారు సైతం 

తీరు మార్చి తనపై గెలిచిన 

అభ్యర్థికి బ్రహ్మరథం కట్టడం..

అయిదేళ్ల పీడ వదిలిందనే ధోరణి అవలంబించడంm పరాకాష్ట..!


పేరుకు ముందు మాజీ..

అవమానాలతో రాజీ..

ఇన్నాళ్లు అక్రమాలలో పీజీ..

ఇప్పుడేమో చిరిగిపోయిన గత వైభవ పేజీ..

లేదు బిజీ..

మున్సిపల్ కార్పొరేషన్ కూడా

త్వరలోనే చేజారిపోతే

ఇక మళ్ళీ అందలం ఎక్కడానికి

ఏదీ పరంజీ..!


ఇలా ఒక్కోరిది 

ఒక్కో అతి.. 

అతిక్రమణ..ఆక్రమణ..

దురాక్రమణ..చివరకు

తిరస్కరణ..!


గజపతినగరంలో

అమితంగా ఆర్జనలు..

ఎస్ కోటలో అనవసర

గర్జనలు..

నెల్లిమర్లలో విపరీత పోకడలు..

సాలురులో మెతక అనిపించుకుంటూ వ్యవహారాల్లో ముతక...

బొబ్బిలిలో ఆసలు 

ఏమీ చెయ్యని వైనం..

పార్వతీపురంలో 

అవినీతి కాపురం..


ఇలా ఒక్కో ఎమ్మెల్యేది 

ఒక్కో వీరగాధ..

కట్ చేస్తే..

ఇంకేముంది జనమే 

కట్ చేశారు తోక..

కెవ్వు కేక..!


సరే...శృంగభంగం తర్వాతైనా బుద్ధి వచ్చిందా అంటే అదీ లేదు.ఒక్కరిలోనూ పశ్చాత్తాపం కనిపించలేదు.అంతర్మధనం అంతకంటే లేదు.ఇప్పుడేమో కొందరు పక్క చూపులు..

ఈళ్ళని రానిచ్చేదెవరి అని అప్పుడే చెవి కొరుకుళ్లు..!.


ఇక్కడ మరో సమస్య..

ఉన్న పార్టీ వదిలి సిగ్గు విడిచి

వేరే పార్టీలోకి వెళ్దామని అనుకుంటున్నా అటు మూడు పార్టీలు ఒకే త్రాటిపై ఉన్నాయి.

వాటి మూడు మారేవరకు ఎదురు చూద్దామంటే ఈలోగా పెజలకు మరింత దూరమైపోయే పెమాదం..

అయినా అంత మెజార్టీ ఉన్న పార్టీలు ఈ తెగ్గోడిపోయిన కేసుల్ని చేర్చుకుంటాయా. 

డౌటే..!..


కాంగ్రెస్సే శరణమా...

ఇప్పటికి ఈ అవమానమే

ఆభరణమా..!?


(*_మా ఊరి ఫేస్ బుక్కు నుంచి.._*)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు