కిట్స్ వరంగల్ సెంట్రల్ లైబ్రరీ లో కేయూ గ్రంథాలయ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం



సెంట్రల్ లైబ్రరీ, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ వారు కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగం ఎం .ఎల్ .ఐ .ఎస్ .సి విద్యార్థుల కోసం కళాశాల గ్రంథాలయంలో శుక్రవారము ఒకరోజు   శిక్షణ కార్యక్రమం  నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్, కె అశోక రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ  కార్యక్రమంలో  20 మంది కాకతీయ విశ్వవిద్యాలయం ఎం ఎల్ ఐ ఎస్ సి గ్రంథాలయ శాస్త్ర విభాగం విద్యార్థులు పాఠ్య ప్రణాళికలో భాగంగా పాల్గొన్నారు. 


  ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రరీ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం శ్రీలత మాట్లాడుతూ గ్రంథ పాలకుల వృత్తి ఉన్నతమైనదని, ఈ శిక్షణలో గ్రంథాలయాల గురించి పూర్తి ఆచరణాత్మక పరిజ్ఞానం తెలుసుకోవాలని, తద్వారా గ్రంథాలయ వృత్తిలో రాణించాలని సూచించారు, కళాశాల గ్రంథాలయంలో అత్యాధునిక కరమైన సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారని తెలిపారు.

  

ఈ సందర్భంగా కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ కే. ఇంద్రసేనారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  కళాశాల గ్రంథాలయంలో అందించే సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు టెక్నికల్ సెక్షన్, స్టాక్ ఏరియా, రిఫరెన్స్ సెక్షన్ , సర్కులేషన్ సెక్షన్, గ్రంథాలయ వర్గీకరణ, పుస్తకాల అమరిక, డిజిటల్ లైబ్రరీ, రిమోట్ యాక్సిసింగ్ జరిగే విషయాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించడం జరిగింది.

రాజ్యసభ మాజి సబ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి.నారాయణరెడ్డి,హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే ,కిట్స్ అడిషనల్ సెక్రెటరీ,  వి. సతీష్ కుమార్ గ్రంథాలయ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నీ విజయ వంతంగా నిర్వహించి నందుకు సెంట్రల్ లైబ్రరీ సిబ్బందినీ అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ఇసిఐ విభాగాధిపతి , ప్రొఫెసర్ కె. శివాని,  అసోసియేట్ ప్రొఫెసర్లు, డాక్టర్ ఎం. రాజు, ఇ. సురేష్, లైబ్రరీ సిబ్బంది: అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎం. నిరంజన్, డాక్టర్ ఎం. అరుణ్ కుమార్, పి. సుమలత, టి.రాజు,  ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి,   మరియు కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.


---Ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు