కిట్స్ వరంగల్ యాజమాన్యం సంస్థాగత సామాజిక బాధ్యత కింద కంప్యూటర్లు, ప్రింటర్లు, స్పోర్ట్స్ మెటీరియల్ ను బాసిత్‌నగర్ ప్రభుత్వ హైస్కూల్ కు అందజేసింది.
కిట్స్ వరంగల్ యాజమాన్యం సంస్థాగత సామాజిక బాధ్యత కింద హన్మంకొండ లోని బాసిత్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ కు కంప్యూటర్లతో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ అంద చేసింది. రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌ను ఇంకా స్పోర్ట్స్ మెటీరియల్ ను బాసిత్‌నగర్ ప్రభుత్వ హైస్కూల్ కు విరాళంగా అందచేసినట్లు కిట్స్ కాలేజి ప్రిన్సి పాల్ కె.అశోకా రెడ్ిడ తెలిపారు.
రాజ్య సభ మాజి సబ్యులు కిటిస్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి, పి. నారాయణ రెడ్డి, వీటిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో జరగిన ఓ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సి. మహేందర్ రెడ్డికి అందజేశారు.
విద్యార్థులకు ప్రయోజనాల కోసం కంప్యూటర్లు సమకూర్చినట్లు యాజమాన్యం పేర్కొంది. కిట్స్ వరంగల్ యాజమాన్యానికి బాసిత్‌నగర్, ప్రధానోపాధ్యాయులు, సి.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం డిజిటల్ విద్యాభ్యాసం తోడ్పడుతుందని అన్నారు.
స్పోర్ట్స్ మెటీరియల్, టెన్నికాయిట్ రింగులు మరియు స్కిప్పింగ్ రోప్‌లను విరాళంగా అందించినందుకు హెచ్‌ఎం సి. మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ కిట్స్ వరంగల్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇతోధికంగా సేవలు అందిస్తున్నామని క్రీడలు టేబుల్ టెన్నిస్ కోసం ఇండోర్ స్టేడియం, క్యారూమ్‌లు, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్ మరియు ఖో-ఖో వంటి అవుట్‌డోర్ గేమ్‌ల కోసం మైదానాలు సమకూర్చి , వివిధ ఆటలకు కోచింగ్ మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాసిత్ నగర్ ఉపాధ్యాయులు ఎ.పరమేశ్వర్, బి.రవి, కిట్స్ వరంగల్ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ యమ్. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్. పి.రమేష్ రెడ్డి, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి, ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box