విద్యార్థికి టూషన్ ఫీజు చెల్లించిన కిట్స్ పూర్వ విద్యార్థులు

 


కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో  కిట్స్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం (కిట్స్‌వా) 1982-86 బ్యాచ్  2 లక్షల రూపాయలను బి. టెక్ రెండవ సంవత్సరం ఈ సి ఐ విద్యార్థిని కి విరాళం అందజేశారు.

కిట్స్‌డబ్ల్యు 1982-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, రూ.2.0 లక్షల విలువైన చెక్కును బి.టెక్‌ 2వ సంవత్సరం చదువుతున్న ఈ సి ఐ విద్యార్థిని నమ్రత కి అందజేశరు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వెల్లడి

నేడు, కాకతీయ  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ అలమ్నై అసోసియేషన్ ( కిట్స్‌వా- కిట్స్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం) 1982-86 బ్యాచ్ వారు 2 లక్షల రూపాయలను విరాళంగా బి. టెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఈ సి ఐ విద్యార్థిని నమ్రత కి  అంద చేశారు.

పేదరిక కారణంగా విద్యార్థిని తల్లిదండ్రులు  ఆమె చదువుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయారు. విద్యార్థిని ఆర్థిక స్థితి గతులు విచారించిన అనంతరం  కళాశాల ప్రిన్సిపాల్ అశోకా రెడ్డి  రూ.2.0 లక్షల చెక్కును పూర్వ విద్యార్థుల సామాజిక బాధ్యతగా విద్యార్థిని తల్లి దండ్రుల సమక్షం లో అంద చేశారు.

 కిట్స్  క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోకారెడ్డి మాట్లాడుతూ విద్యార్జనకు పేదరికం అడ్డుకాదని    నైపుణ్యం సంపాదించి వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మెరుగైన ప్లేస్‌మెంట్‌ల కోసం శ్రద్ధ వహించాలని  సూచించారు. 


కళాశాలలో కిట్స్‌వా సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ కళాశాల పురోగతికి ఇతోదికంగా తోడ్పడతున్నారని అన్నారు.  

 ప్రపంచవ్యాప్తంగా కళాశాల గర్వించదగిన పూర్వ విద్యార్థులు గొప్ప పారిశ్రామిక వేత్తలు గా మరియు నిష్ణాతులుగా ఎదిగారని వారి సహకారంతో  వర్క్‌షాప్‌లు, సమావేశాలు, అతిథి ఉపన్యాసాలు నిర్వహించడం ద్వారా  విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 

ఈ కళాశాలలో  విద్యనభ్యసించే విద్యార్థులు కష్ట పడి తమ లాగే చదివి నిష్టాతులుగా ఎదగాలన్నదే  కిట్స్ వా ఉద్దేశ్యమని అన్నారు. 

  ఈ కార్యక్రమంలో కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్, ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, ఇసిఐ విభాగాధిపతి, ప్రొఫెసర్ కె. శివాని, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. కె. శ్రీనివాస్, విద్యార్థిని నమ్రత తల్లిదండ్రులు,  ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు