ఎపిలో ఏం జరుగుతోంది డిప్యూటి సిఎం పవన్ ను పక్కకు పెట్టారా ?

 


ఎపిలో ఏం జరుగుతోంది డిప్యూటి సిఎం పవన్ ను పక్కకు పెట్టారా ?

మేధోవర్గ మధనం - చలసాని శ్రీనివాస్ రావు డౌట్




ఎన్నికల అనంతరం ఎపిలో రాజకీయ పరిస్థితులపై బిన్నమైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. జనసేన, టిడిపి, బిజెపి కలయికతో ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చింది. బాబు ముఖ్యమంత్రిగాపవని ఉప ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలు చేపట్టారు.

అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వ కీలక నిర్ణయాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ ఎందుకని దూరంగా ఉంటున్నారని కొందరు  అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు నేరుగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  ఆంధ్ర మేధావిగా రాష్ర్ట విభజన సమయం నుండి టివి డిబేట్లలో ముధ్ర పడిన చలసాని శ్రీనివాస్ రావు ఏకంగా పవన్ పాత్రపై పెద్ద అనుమానమే వ్యక్తం చేసారు.  ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడుగా కూడ చలసాని శ్రీనివాస్ రావు ఉన్నారు.  పవన్ కల్యాణ్ ఎందుకనో అంటీముట్టనట్టుగా  ఉంటున్నారని ఆయన పాయింట్ ఆఫ్ ఢౌట్ తేవనెత్తారు. ఈ డౌట్లు అటు జనసేన పార్టీలో కూడ సంభాషణల్లో లేవనెత్తుతున్నారు. 

 అన్నారు.

ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కుడి బుజం ఎడమ బుజం రీతిలో ప్రభుత్వం నడుపుతారనుకుంటే అంతా ఏక వ్యక్తి షో నడుస్తోందని జన సేన కార్యకర్తలు విచార వదనావలతో ఉన్నారట. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదాన మంత్రి నేరంద్ర మోదీని డిల్లీ వెళ్లి  కల్సి రాష్ర్ట సమస్యలపై వివరించిన సందర్భంలో పవన్ కళ్యాన్ ఆయన వెంట లేరు. 


కీలక మైన రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ముఖా ముఖి చర్చలు కూర్చున్నా డిప్యూటి మాత్రం వెళ్ల లేదు.

అయితే చలసాని మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల పంపకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. గుజరాత్ పాలకుల కాళ్ల కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా? అని చలసాని శ్రీనివాస్ నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై వుందని ఆయన గుర్తు చేశారు.

పవన్ కళ్యాన్ విషయం పక్కకు పెడితే ఏపీకి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనేది ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ర్ట విభజన అనంతరం ఇదే అంశంపై టిడిపి , వైసిపి ఎ్ననికలకు వెళ్లాయి. రెండో దఫా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

ఎన్డిఏ కూటమిలో బాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసారు. మరి బాబు వైఖరి ఏమిటనేది ఇక్కడ ఎపిలో అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా ప్రస్తావనలుంటాయా లేక పక్కదారి పట్టిస్తారా అనేది చూడాలంటున్నారు ఎపి ప్రజలు.


---ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు