తెలంగాణ విశ్వవిద్యాలయ హాస్టల్స్ లో కొనసాగుతున్న మరమ్మతులు -రిజిస్ట్రార్ ఆచార్య. ఎం.యాదగిరి

 



తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్ ల్లో మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని రిజిస్ట్రార్ ఆచార్య. ఎం.యాదగిరి  తెలిపారు.


 ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయంలో హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడతామని అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపట్టినామని తెలిపారు.


గ్రూప్ 1 పోటీ పరీక్షల నిమిత్తం  విద్యార్థుల కోరిక మేరకు వైస్ ఛాన్స్లర్  ఆదేశాన్ని అనుసరించి ఈ సంవత్సరం వేసవికాలంలో, లైబ్రరీ లో కూలర్లు ఏర్పాటుచేసి  అవసరమైన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి  లైబ్రరీ తో పాటు  హాస్టల్స్ ను   తెరిచి ఉంచినమని పేర్కొన్నారు.


 పోటీ పరీక్షలకు అర్హత లేక,సిద్ధంగాని విద్యార్థులు  గదులకు తాళాలు వేసుకుని  సొంత ఇంటికి వెళ్లినందున  ఆ గదులకు మరమ్మతులు చేయలేదని జూన్ 13న కళాశాల పునః ప్రారంభం అనంతరం మరమ్మతులు ప్రారంభించామని,  త్వరలో పూర్తవుతాయని   రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు