_అశ్వద్ధామ హతహ కుంజరహ..అమితాబ్ ఆహాహా..!



 అనన్య సామాన్యం.

కథ నాగ్ అశ్విన్ రాసుకున్నా..

ప్రభాస్ హీరో అనుకున్నా..

సాంకేతికత అపూర్వం

అనిపించినా..

సినిమాలో ఎందరున్నా..

మొత్తం బరువు మోసింది 

మాత్రం బచ్చన్ సాబ్ 

అమితాబ్ ఆహాహా..!



సురేష్  కుమార్ ఎలిశెట్టి

          9948546286)


ఒక జంజీర్ ..

ఒక దీవార్..

ఒక మజ్బూర్..

ఒక షోలే..

ఒక నసీబ్..

ఒక డాన్..

ఒక శక్తి..

ఒక బ్లాక్..

ఒక సర్కార్...

ఒక పా..

ఒక పింక్..


ఒక *_కల్కి..2898 ఎడి.._*


ఎన్ని హిందీ సినిమాలు..

ఎన్నెన్ని పాత్రలు..


పోలీస్..స్మగ్లర్.. వీరుడు..డాన్..

రోగి..పొట్టివాడు..

గాంగ్ మాష్టర్..లాయర్..


ఇలా విభిన్న పాత్రలు..

వైవిధ్యభరితమైన నటన..

కొన్ని పాత్రలు అపురూపం..

కొన్ని సినిమాలు అపూర్వం..


ఏ పాత్ర ఇచ్చినా గాని

అమితాబ్ తగ్గేదేలే..


యాంకర్ గా కూడా

కౌన్ బనేగా కరోర్ పతిలో

అద్భుత ప్రదర్శన..

హుందాగా..

తన స్థాయి పెరిగేలా..

ఆయన కారణంగానే

ఆ టివి షోకి ఒక లెవెల్..

అంత సూపర్ హిట్టు..


*_అలాంటి అమితాబ్ బచ్చన్.._*


ధర్మేంద్ర..దిలీప్ కుమార్..

సంజీవ్ కుమార్..

రాజేష్ ఖన్నా..

శతృఘ్నసిన్హా..

వినోద్ ఖన్నా..

అంజాద్ ఖాన్.. ప్రాణ్..

ఇలా ఎందరో హేమాహేమీలతో

పోటాపోటీగా నటించి..

తానేమిటో నిరూపించుకున్న

మహానటుడు..

పాన్ ఇండియాని 

మించిన స్థాయి..

ఆలిండియా సూపర్ స్టార్..

81 నాటౌట్..వయసు..

182 నాటౌట్.. సినిమాలు..!


జై..విజయ్....

ఇప్పుడు జయవిజయ్..

అశ్వద్ధామ..హతః.. కుంజరః..


మరణమే లేని చిరంజీవి అశ్వద్ధామ పాత్రను

సజీవంగా ఆవిష్కరించిన తీరు

అనన్య సామాన్యం.

కథ నాగ్ అశ్విన్ రాసుకున్నా..

ప్రభాస్ హీరో అనుకున్నా..

సాంకేతికత అపూర్వం

అనిపించినా..

సినిమాలో ఎందరున్నా..

మొత్తం బరువు మోసింది 

మాత్రం బచ్చన్ సాబ్..


ఆ ఆహార్యం..

నిండైన ఆ విగ్రహం..

అద్భుతమైన నట విన్యాసం..


తెలుగు తెరపై..

అక్కినేని దేవదాసు..

ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ..

కృష్ణ అల్లూరి సీతారామరాజు..

చిరస్థాయిగా నిలిచిపోయే

అభినయాలు..

కొందరు అంగీకరిస్తారో లేదో

గాని కల్కి 2898 లో

అమితాబ్ బచ్చన్ చూపిన

నటవిశ్వరూపం అంత గొప్పదే.


నాగేశ్వరరావు..కృష్ణ

ఆయా పాత్రలను వయసులో ఉన్నప్పుడు అంత

స్థాయిలో చేసి చూపించారు.

ఎన్టీఆర్ యాభై నాలుగేళ్ల వయసులో త్రిపాత్రాభినయం..

అపూర్వం..


అయితే..కల్కిలో 

అశ్వద్ధామ పాత్ర..

ఇప్పుడు బచ్చన్ 

వయసు 81..

పూర్తిగా టెక్నాలజీ ప్రభావంతో తీసిన సినిమాలో నటీనటుల్లో 

సాంకేతికత పరిధిని మించి

పాత్రగా..నటుడిగా కనిపించింది

అమితాబ్ ఒక్కరే..అశ్వద్ధామ పాత్ర లేకపోయినా..ఆ పాత్రను

అమితాబ్ చేసి ఉండకపోయినా ఇప్పుడు మనం ఇలా కల్కి సినిమా గురించి ఇలా..ఇంతలా మాట్లాడే పని లేదు..

ఆరువందల కోట్లు ఖర్చు పెట్టి

ఉండవచ్చు గాక..

*_ఆ సినిమాకి అమితాబ్_* *_అంతకు మించి పెట్టుబడి.._*

*_ఆయనే రాబడి కూడా..!_*


ఆయన పాత్రను ప్రేమించాడు..

ఆపై పాత్ర ఆయన్ని ఆవహించింది..

ఎప్పటికీ జీవించి ఉండే

అశ్వద్ధామ పాత్రలో

ఆయన నిజంగా జీవించి

పాత్రకు జీవం పోశారు..

అశ్వనీదత్ సినిమాని

అశ్వంలా పరుగు పెట్టించారు.

అశ్విన్ కథలో..

నిజమైన యశస్విగా నిలబడ్డారు.


అమితాబ్ లేని కల్కిని

ఊహించండి..చూద్దాం..

అప్పుడు కల్కి..

కళ ఉండని ఓ కల మాత్రమే..

మొహమాటం లేకుండా చెప్పాలంటే *_పీడకల..!_*


✍️✍️✍️✍️✍️✍️✍️✍️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు