ఉత్తమ సేవలతోనే రాజకీయ అవకాశాలు : వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గండ్ర జ్యోతి

  


 ▪️జిల్లా పరిషత్ సభ్యుల ఆత్మీయ  వీడ్కోలు సమావేశం....

 ▪️ముగిసిన జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం.....

 ▪️చైర్మన్ సభ్యులకు ఘన సన్మానం.....

  ▪️సమావేశం లో పాల్గొన్న హన్మకొండ వరంగల్ జిల్లా ల అదనపు కలెక్టర్లు....

 వరంగల్, 04 జూలై, 2024 : ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తే రాజకీయ అవకాశాలు లభిస్తాయని వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గండ్ర జ్యోతి అభిప్రాయపడ్డారు.


  గురువారం హనుమకొండ లోని వరంగల్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్ పి సీఈఓ రామ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

  ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిషత్తు  ఐదు సం. ల (2019-24) పాలన కాలం సంతృప్తిగా సాగటం పట్ల  హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్మన్ సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.



జిల్లా పరిషత్తు ఛైర్మెన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ

 తాను 18 సంవత్సరాల క్రితం  కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అభ్యర్థిగా  నిలిచిన్నప్పటికీ మేయర్ గా అవకాశం దక్కలేదని  అప్పుడు కార్పొరేటర్ గా  ప్రజలకు సేవలు అందించడం జరిగిందని  సభ్యులందరి సహకారంతో తాను జడ్పీ చైర్మన్ గా  ఎంపిక కావడం జరిగిందని  కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో మహిళలకు విస్తృతంగా రాజకీయ అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 16 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని  ఒక్కో జడ్ పి టి సి కి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ .90 లక్షల వరకు అందించామని  పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి ప్రభుత్వం 33  జిల్లాలను ఏర్పాటు చేసిన క్రమంలో తనకు జడ్పీ చైర్మన్ గా అవకాశం దక్కిందని, వివిధ అభివృద్ధి పనులు చేసే అవకాశం లభించడం వల్ల నేడు గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, ప్రస్తుతం గ్రామాలలో 500 మందికి ఒక పారిశుద్ధ్య కార్మికుడు  సేవలు అందించేలా  చర్యలు చేపట్టడం జరిగిందని, తద్వారా గ్రామాలు  పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధుల తీవ్రత తగ్గిందని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీడీవోలు, ఏపీవోలు  కృషి చేశారని,  జిల్లాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు  సమన్వయంతో పనిచేయడం వల్ల  అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడం జరిగిందని వివిధ అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ లకు నేరు గా నిధులు అందించడం జరిగిందని ఛైర్మెన్ గండ్ర జ్యోతి తెలిపారు.


  హనుమకొండ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాధిక గుప్తా   పదవి కాలం ముగిసిన సందర్భం గా ఛైర్మెన్ జడ్ పి టీ సి  ఏం పి పి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


  వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి  తీసుకెళ్లడంలో అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర  కీలకంగా ఉంటుందని ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ఉత్తర్వులు (జీవోలు) విడుదల చేయడం జరుగుతుందని, వాటి ప్రాతిపదికన అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని,  ప్రజల సమస్య పరిష్కారాన్ని ప్రామాణికంగా తీసుకొని మానవతా కోణంలో స్పందించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.


  పదవి కాలం పూర్తి చేసుకున్న జిల్లా కు చెందిన జడ్పీటీసీలు ఎంపీపీలను జడ్పీ చైర్మన్ శాలువా లతో సత్కరించి మెమొంటోలను అందజేశారు.


  ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్  ఫ్లోర్ లీడర్ జడ్పీటీసీలు ఎంపీపీలు అధికారులు శాలువాలతో సత్కరించి  జ్ఞాపికలను అందజేశారు.

  అంతకుముందు జడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ ఉన్నత విభాగాల అధికారులు ఆయా మండలాలు గ్రామాలు ప్రజా ప్రతినిధులతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


  ఇట్టి కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఫ్లోర్ లీటర్ పెద్ది స్వప్న, వ్యవసాయ శాఖ ఏడి ఉషా దయాల్, డిఇఓ వాసంతి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు