కిట్స్ వరంగల్ కాంపస్ లో ముగిసిన ఫ్యాకల్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్‌ "(యఫ్ ఐ పి)

 


 కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్ వరంగల్) ఆధ్వర్యంలో ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ( ఐక్యూఏసీ)వారు ఒక వారం పాటు "కొత్తగా రిక్రూట్ అయిన ఫ్యాకల్టీకి నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ (యఫ్ ఐ పి ) ముగింపు కార్యక్రమాలను కిట్స్  వరంగల్ క్యాంపస్‌ ఐబిఎం ల్యాబ్ లో ఇది 2024 జూలై 9 నుండి 13 వరకు ఒక వారం రోజుల పాటు నిర్వహించారు. 


శనివారం ఇండక్షన్ ప్రోగ్రామ్‌ ముగింపు కార్యక్రమం జరిగింది.   ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా  ఈఈఈ ప్రొఫెసర్ మరియు కిట్స్ వరంగల్ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ (సి ఓ ఈ), ప్రొఫెసర్ వి. రాజగోపాల్ మాట్లాడుతూ కొత్తగా చేరిన అధ్యాపకులను అకడమిక్స్ మరియు అడ్మినిస్ట్రేషన్‌లో పరస్పర సమన్వయం కోసం ఫ్యాకల్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని అన్నారు.


 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రశ్నాపత్రాల అమరిక, పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం, విద్యార్థుల బోదనా నిర్వహణలో నైపుణ్యాలు మరియు నిర్వహణ యొక్క అవలోకనం, సమగ్ర అభివృద్ధికి సంబంధించిన శిక్షణ పొందారు.   


ఐక్యూ ఏసీ సమన్వయకర్త ప్రొఫెసర్‌ సి.వెంకటేష్‌ అధ్యక్షోపన్యాసం చేశారు.  యఫ్ ఐ పి  అనేది హైబ్రిడ్ మోడ్ ఆఫ్ టీచింగ్ రంగంలో సామర్థ్యాలను మెరుగుపరచడానికి  పరిశోధనల ఆవిష్కరణల కోసం ఒక ఉపయోగకరమైన వేదికని అన్నారు.

 సెషన్లలో నేర్చుకోవాలని మరియు అమలు చేయాలని అతను పాల్గొన్నవారికి సలహా ఇచ్చి, అధ్యాపకులలో జ్ఞానం మరియు నైపుణ్యాలను నవీకరించడానికి ఉపయోగకరమైన వేదికని  తెలిపారు. 

  రాజ్యసభ మాజి సబ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు మరియు కిట్స్ వరంగల్ కోశాధికారి   పి.నారాయణరెడ్డి & హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే  కిట్స్ అడిషనల్ సెక్రెటరీ,  వి. సతీష్ కుమార్ ఫ్యాకల్టీ  ఇండక్షన్  ప్రోగ్రామ్‌ కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించి నందుకు  అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 


 ఈ కార్యక్రమంలో అందరు డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు;  ప్రొఫెసర్ కె. శ్రీధర్,   ఐ2ఆర్‌ఇ హెడ్, ప్రొఫెసర్ కె. రాజనరేందర్ రెడ్డి &   ప్రొఫెసర్  యు ఎస్ బాల్‌రాజ్, ఇఇఇ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్,  డాక్టర్ పి. నాగార్జున రెడ్డి,  ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకరా చారి తో పాటు 64 మంది  ఇంజనీరింగ్ అధ్యాపక పార్టిసిపెంట్స్ మరియు సిబ్బంది, కార్యాలయ సూపరింటెండెంట్, వేణుగోపాల్ రెడ్డి, డిటిపి ఆపరేటర్, డి. అశోక్ చురుకుగా పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు