కిట్స్ లో ముగిసిన ఫాకల్టిడెవలప్ మెంట్ ప్రోగ్రాం

 


“రాపిడ్ ప్రోటోటైపింగ్ మరియు సి యఫ్ డి విశ్లేషణ” అనే అంశంపై రెండు వారాల యఫ్ డి పి  ముగింపు


కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ ఆధ్వర్యంలో "రాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సి యఫ్ డి ) అనాలిసిస్" అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డిపి)  కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని యంక్యా డ్ ల్యాబ్ లో ముగిసింది.  

మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం   జూన్ 18 నుండి జూలై 1, 2024 వరకు రెండు వారాల పాటు ఈ కార్యక్రమం  నిర్వహించి నట్లు ప్రిన్సిపాల్ అశోకా రెడ్డి తెలిపారు.

 

 ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వి-యాక్సిస్ లెర్నింగ్ హైదరాబాద్, సహ వ్యవస్థాపకులు, దిలీప్ మాట్లాడుతు అధ్యాపకుల నైపుణ్యం కోసం  సి యఫ్ డి, త్రీడి ప్రింటింగ్, ఐ ఒ టి, ఎలక్ట్రికల్ వెహికల్ సిస్టమ్స్ మరియు ఎ ఐ / యం యల్  వంటి తాజా పరిశ్రమ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు.హ్యాండ్స్ -ఆన్ అప్లికేషన్ పై చర్చను కొనసాగంచారు. మెకానికల్ ఇంజనీరింగ్ వారికి మూడు ప్రాథమిక టేక్ అవేలు ఇచ్చారు: 

ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యలో  రాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ యొక్క పాఠ్యాంశాలు ఇండస్ట్రీ కొలాబో రేషన్తో కూడిన శిక్షణ ఉద్యోగ సముపార్జన లో కీలక పాత్ర పోషిస్తాయని  ఆయన అన్నారు.


 కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎ ఐ మరియు యం యల్ సాంకేతికతలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికతలతో పాల్గొనే  అధ్యాపక బృందం ను సన్నద్ధం చేయడానికి  యఫ్ డి పి రూపొందించినట్బలు తెలిపారు. అధ్యాపకులు వారి రంగాలలో నూతన పురోగతుల గురించి తెలుసుకునేలా చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందనిఎంతో  నిబద్ధత, నైపుణ్యం అవసరమయ్యే అధునాతన సైన్స్ & టెక్నాలజీని బోధించడం మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని తప్పనిసరిగా కొనసాగించాలని అన్నారు.  

ఈ సందర్భంగా రాజ్యసభ మాజి  సబ్యులు , కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు  కిట్స్ వరంగల్ కోశాధికారి  పి.నారాయణరెడ్డి & హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే మరియు కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ , కిట్స్ వరంగల్ డీన్ అకడమిక్స్ & మెకానికల్ ఇంజనీరింగ్  అధ్యాపక బృందంను యఫ్ డి పి నీ విజయ వంతంగా నిర్వహించి నందుకు అభినందించారు.  

ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ డీన్ అకడమిక్స్, ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ పబ్బ, సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ కె.శ్రీధర్‌, ప్రొఫెసర్‌ కె.రాజనరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ యు.ఎస్‌.బాల్‌రాజ్‌,  అధ్యాపక కోఆర్డినేటర్స్ గా కరుణాకర్, డా. జి. శ్రీను & డా. ఇ. రమేష్ మరియు ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకరా చారి, మరియు 30 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు