మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం



 గత కొద్ది కాలం క్రితం మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక  సహాయం, ఐదు సంవత్సరాల పాటు ప్రతి కుటుంబానికి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్, ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు 2000 రూపాయల ట్యూషన్ ఫీజు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి మంజూరు చేసినట్లు శుక్రవారం మీడియా అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదానికి గురై భృతిని కోల్పోయిన జర్నలిస్టులు, ఇతర వ్యాధులకు గురైన వారికి తీవ్రతను బట్టి లక్ష చొప్పున,ఇద్దరికి 50 వేల రూపాయల చొప్పున మొతం  ఐదుగురికి ఆర్థిక సాయం అందజేసినట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు


శుక్రవారం జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి సమావేశంలో సమాచార పౌర సంబంధాల కమిషనర్ పక్షాన జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు