-తల్లి గోదారీ - ఇది కాదమ్మా నీ దారి!

 


*_తల్లి గోదారీ.._*

*_ఇది కాదమ్మా నీ దారి!_*


_______________________


(*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*)

      *విజయనగరం*

     9948546286


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽



*_గలగలా గోదారి_* *_కదలిపోతుంటేను.._*

*_బిరబిరా ఆ తల్లి సాగిపోతుంటేను.._*

*_ఎంత అపురూపమో_* 

*_ప్రతి పాయ.._*

*_ఆ నడకలో అందమైన లయ_*

*_ఆ హోరులో శ్రావ్యమైన శృతి_*

*_ప్రకృతి మాత తానే_*

*_ఘంటం పట్టి రాసుకున్న_* 

*_అద్భుతమైన కృతి.._*

*_అసలు గోదావరి_*

*_ప్రకృతి తానుగా దాల్చిన_* 

_*అందమైన ఆకృతి..!*_


*_ఆ తల్లి గోదారి_*

*_అలా అందంగా సాగుతూ_*

*_స్పర్శా మాత్రమునే_*

*_ఊళ్లూ వాడలూ పులకింపచేయదా.._*

*_ఒక్కచూపు చాలదా_*

*_బీడు భూమైనా_*

*_తొడగదా ఆకుపచ్చని పరదా_*

*_ప్రతి పల్లె గోదావరి ముల్లె.._*

*_ఆయమ్మ సింగారించే_* 

*_సిరుల సిరిమల్లె..!_*


*_ఎక్కడి నాసిక్.._*

*_ఎన్ని మలుపులు.._*

*_ఎన్నెన్ని వంపులు.._*

*_ఎంతెంత పులకరింపులు.._*

*_ఇంకెన్ని పలకరింపులు.._*

*_ఏ ప్రాంతానికైనా_* 

*_ఆ తల్లి ఘోష వినిపించును_* 

_*తన భాష..*_

*_ఊరికే వచ్చి పోతదా తల్లి_*

*_గొంతుకు నీరు.._*

*_పొలానికి జల.._*

*_ఊరికి గలగల.._*

*_భూమికే కళ..!_*


_*త్రయంబకంలో పుట్టుక..*_

_*తప్పటడుగులు లేక....*_ *_తప్పుటడుగులు తెల్వక.._*

*_తప్పెటగుళ్ల సద్దుతో_*

*_నడక నేర్చి.._*

*_పదములు కూర్చి.._*

*_అదుపు తప్పే_* 

*_పరవళ్లకు ఓర్చి.._*

*_ముత్యాల సరాలు పేర్చి.._*

*_సాగే ప్రవాహం.._*

*_చక్కని నాట్యమై.._*

*_ఆ శబ్దమే_*

*_ఛందస్సు కూడిన_* 

*_సొగసైన పద్యమై.._*

*_నిజామాబాదు కందకుర్తిలో_* 

*_తెలంగాణను తట్టి.._*

*_ఆదిలాబాదు..కరీంనగరు.._*

_*ఖమ్మం గుమ్మం తడిపి..*_

*_భద్రాద్రి రామయ్యను దర్శించి_*

*_అచ్చోట అందంగా నర్తించి_*

*_అదిగదిగో తల్లి చేరింది_*

*_రాజమహేంద్రవరం.._*

*_అపర అన్నపూర్ణ_* 

*_అందంగా తొడిగిన సవరం.._*

*_అపార ధాన్యరాశులే వరం..!_*


*_తల్లీ..మేమెరిగిన_* 

*_ప్రశాంత గోదారి.._*

*_నిర్మల పూలదారి.._*

*_వేద ఘోష.._*

*_తూర్పు పశ్చిమల_*

*_ఆకట్టుకునే బాస.._*

*_చిత్రమైన యాస.._*

*_పులకిత భద్రాద్రి.._*

*_నవ్వుతూ రామయ్య.._*

*_నీ చల్లని చూపుతో_* 

*_తరించే తెలుగు నేల.._*

*_మరి ఈ రోజున_* 

*_అంతటి ఉగ్రరూపమదేల_*

*_నీ పరవళ్ళ సవ్వడిలో.._*

*_హోరెత్తించే ఆ వడిలో.._*

*_చల్లనైన నీ ఒడిలో.._*

*_ఎంతటి అలజడి..!_*

*_ఊళ్ళూ వాడలూ ముంచెత్తాలనే పరుగు వలదమ్మా.._*

*_ఏంటా ప్రళయభయంకర నృత్యం.._*

*_ఎన్నడూ చూడని_*

*_ఈ రీతి.._*

*_ఈ గతిని మేమెరుగని_*

*_నీ నిరతి.._*

*_ఓ తల్లీ.._*

*_నీ బిడ్డలు తల్లడిల్లగ.._*

*_భక్తవరదుని పాదాలే.._*

*_వరద నీటిలో_* *_తడిచిపోవగా..!_*


*_ఇంతటి ఉగ్రరూపం_*

*_వద్దమ్మా..అది నీకు కద్దమ్మా_*

*_వరద అంతరించగా.._*

*_నిర్మల గోదారిగా_*

*_మళ్లీ అవతరించగా_*

*_తెలుగు తల్లి తరించగా..!_*


***********************

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు