ఆ బ్యాట్..ఆ గ్లవ్స్..కలిస్తే కప్పులే..!


 *_ఆ బ్యాట్..ఆ గ్లవ్స్.._*

*_కలిస్తే కప్పులే..!_*


 _ఎం ఎస్ ధోనీ బర్త్ డే_

       07.07.1981

################


*_(సురేష్. 9948546286)_*


🏏🏏🏏🏏🏏🏏🏏


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

ఫార్మాట్ ఏదైనా అవనీ..

ప్రత్యర్థి ఎవరైనా కానీ..

దంచికొట్టడమే అతని పని..

నివ్వెర పోయేలా అవని..!


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

అతడి ఎంట్రీ.. 

మారిపోయింది

ఇండియన్ క్రికెట్ జామెట్రీ..

ఎదిగిపోయింది మన ట్రీ..

మారుమ్రోగిపోయేలా కామెంట్రీ..!


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

రికార్డులు తారుమారు..

పరుగుల సెలయేరు..

ప్రేక్షకుల హోరు..

ప్రత్యర్థులు పరారు..

అదెంతటి వారైనా తకరారు..!


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

అతడి ఆగమనంతోనే

ఇండియాకి రెండు

ప్రపంచ కప్పులు...

రుచే తెలియని పొట్టి క్రికెట్లో

లేపేసాడు పై కప్పులు..

ముషారఫ్ఫే మెచ్చేసిన మేకప్పులు..

తప్పిస్తూ ఎన్నెన్నో 

ఓటమి ముప్పులు..!


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

పేరేమో మిష్టర్ కూల్..

బ్యాట్ పట్టుకొని దిగితే

గ్రౌండులో హల్చల్..

అది కానీ ఫైనల్..

బాల్ వచ్చిందంటే ఫైసల్..!


*_మహేంద్ర సింగ్ ధోనీ.._*

అద్భుతమైన ఫినిషర్..

కేప్టెన్సీలో షంషేర్..

హెలికాప్టర్ షాటు కొడితే

బంతి తూర్మార్..

భారత క్రికెట్లో సిసలైన 

కింగ్ మేకర్..!


_*మహేంద్ర సింగ్ ధోనీ..*_

సచిన్ చిరకాల స్వప్నం

ప్రపంచ కప్పును 

అందించిన నేస్తం..

క్రికెట్టే అతగాడి సమస్తం..

ఆటలో అన్ని రూల్సు కంఠస్థం..

బుక్కులో లేని షాట్లు కొట్టడంలో సిద్ధహస్తం...!


మొత్తానికి ధోనీ..

డార్లింగ్ ఆఫ్ 

ఇండియన్ క్రికెట్..

ఒక తరంలో గవాస్కర్..కపిల్

మరో తరంలో సచిన్..ధోనీ,.

అందరూ మెచ్చినవాడు 

ఈ క్రికెట్ మహాజ్ఞాని..!


🌕🌕🌕🌕🌕🌕🌕


హ్యాపీ బర్త్ డే ధోనీ..


✍️✍️✍️✍️✍️✍️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు