*పరకాల 100 పడకల ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి*
*హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య*
హనుమకొండ : పరకాల లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
బుధవారం నిర్మాణంలో ఉన్న పరకాల ఆసుపత్రిని సందర్శించి అన్ని అంతస్తులను పరిశీలించి త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్లాన్ ను పరిశీలించి ఏ వార్డు లు ఎక్కడ ఉన్నాయని అధికారులు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి నిర్మాణం 35 కోట్ల రూపాయలని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేసి ఆసుపత్రి త్వరగా అందుబాటులోకి వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ నారాయణ, ఈ ఈ ప్రసాద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అనంతరం పరకాల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో గృహజ్యోతి ,మహాలక్ష్మి పథకాల కొరకు ఇంత క్రితమే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తనిఖీ చేసి అక్కడున్న అధికారులతో మాట్లాడుతూ ఎవరైనా దరఖాస్తుదారులు వస్తే వెంటనే సరి చేసి పంపించాలని అన్నారు.అక్కడున్న రిజిస్టర్ను తనిఖీ చేసి రోజుకు ఎంతమంది దరఖాస్తుదారులు వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం దరఖాస్తులు సరి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ, ఎంపీడీవో ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box