రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తి కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు.
శుక్రవారం డైరెక్ట్ రిక్రూట్ అయిన నాలుగవ బాచి ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ బి స్టేడియంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసామని గుర్తు చేశారు.
ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు ముఖ్యమంత్రి శుబాకాంక్షలు తెలిపారు...
శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారన్నారు.
ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదుని విమర్శించారు.
సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు.
తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుందని అన్నారు.
అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామన్నారు.
ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామన్నారు.
ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామని ముఖ్యమంత్రి తెలిపారు.
నిరుద్యోగులకు, విద్యార్థులకు తన సూచన ఒక్కటే...నంటూ ... సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలన్నారు.
మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటాడన్నారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రబుత్వ సలహాదారు వేము నరేందర్ రెడ్డి, ఐజి నాగిరెడ్డి, మాజి డిజిపి రవి గుప్తా పాల్గొన్నారు.
---
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box