మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు.
జిల్లా కలెక్టర్ సామూహిక సముదాయంలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ లో ఆహార పదార్థాల రుచి చూసారు.
క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడారు.
జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో చేపట్టనున్న వివిద అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
గండీడ్ లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి అట్లాగే పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన చేసారు.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసారు.
అధికారులు ప్రజా ప్రతినిధులతో సిఎం సమీక్ష
మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా అభివద్ది సంక్షేమ కార్యక్రమాల పై సమీక్షించారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.
డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.
సిఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణా రావు పాల్గొన్నారు.
---ఎండ్స్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box