సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై భేటీలో చర్చ.
ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యావ్యవస్థలో లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామన్న సీఎం.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేసిన సీఎం.
అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం.
ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి.
ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్న సీఎం.
4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న సీఎం.
సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపిన సీఎం.
రెసిడెన్షియల్ స్కూల్స్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించనున్నామన్న సీఎం.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్న ముఖ్యమంత్రి.
దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న సీఎం.
పదేళ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన విద్యావేత్తలు.
యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని కోరిన విద్యావేత్తలు.
విద్యా, వ్యవసాయ రంగాల సమస్యలపరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామన్న సీఎం.
విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box