ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఎదురుకాల్పుల్లో 11 మంది నక్సల్స్ మృతి


                     Chhattisgarh Encounter 11 Maoists Naxals Killed

 నారాయణపూర్ జిల్లా ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులు

                            11 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు ఐజి ప్రకటన

చత్తీస్ గడ్ లో భారి ఎన్ కౌంటర్ జరిగింది. గాలింపు చర్యలు చేపట్టిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ యాంటీ నక్సలైట్ పోలీసు బలగాలకు మావోయుస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు ఐజీ సుందర్ రాజ్ అధికారికంగా ప్రకటించారు. 

ఈ ఎదురు కాల్పుల్లో పోలీసుల బలగాలలో అందరూ సురక్షితంగా ఉన్నట్లు  ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

 నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది నక్సలైట్లు మృతి చెందారని ధనంది - కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతం కోఖామేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.

మావోయిస్టులు కోసం గత మూడు నెలలుగా చత్తీస్ గఢ్ లో పోలీసు బలగాలు గాలింపు జరుపుతున్నాయి.  డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ యాంటీ నక్సలైట్ బలగాలు  అటవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

ఈ ఎన్ కౌంటరు కు సంభందించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

---ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు