ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి
రామప్ప పరిరక్షణ కమిటీ
ములుగు జిల్లా పేరు మార్పు చేయడానికి నూతన ప్రజా ప్రభుత్వం ముందుకు రావడం చాలా ఆనందించదగ్గ విషయం. కానీ స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ములుగు జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా విరాజిల్లుతున్న, అద్భుత శిల్ప కళా సంపద కలిగిన, శిల్పకళా విశ్వవిద్యాలయంగా, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మరియు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డ ,ఏకైక చారిత్రక శిల్పకళ విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతున్న, శ్రీ భవానీ సహిత రుద్రేశ్వరాలయం కలిగిన ""రామప్ప"" గుడి పేరు మీదుగా నూతనంగా ఏర్పాటు చేయబోయే ములుగు జిల్లాను "శ్రీ రామప్ప ములుగు జిల్లా"గా అని పెడితే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ రామప్ప దేవాలయం యొక్క చరిత్ర, కీర్తి మరింత ఇనుమడింప చేస్తుందని, ఈ పేరు మార్పుకు సహేతుకమైనదని "రామప్ప పరిరక్షణ కమిటీ" భావిస్తున్నది. ఇప్పటికీ, ఎప్పటికీ సమ్మక్క~సారక్కలంటే కూడా మనందరికీ ఎనలేని భక్తి, విశ్వాసాలు, గౌరవ మర్యాదలు ఉన్నాయి.
వాస్తవంగా సమ్మక్క సారలక్క పేర్ల మీద ఇంతకుముందే తాడువాయి మండలానికి నామకరణం చేసి ఉన్నారు.
కావున అద్భుత కళాఖండాలు, శిల్పకళా వైభవం, ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ "రామప్ప" దేవాలయం యొక్క పేరు మరింత ఇనుమడింప చేయడానికి ఈ ములుగు జిల్లాకు "రామప్ప ములుగు జిల్లా" గా పేరు ప్రకటించాలని "రామప్ప పరిరక్షణ కమిటీ" ప్రభుత్వాన్ని కోరుకుంటుంది.
ఇట్లు
రామప్ప పరిరక్షణ కమిటీ
చైర్మన్
ఆకిరెడ్డి రామ్మోహన్ రావు
పిల్లలమర్రి రాము
వకుళాభరణం శ్రీనివాస్
జూపాక రమేష్
రౌతు దేవేందర్
పిల్లలమర్రి శివ
దావు బాబూరావు
ఎలగొండ రాజేందర్
జనగాం రవి
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box