ఏం బాబు పేదోళ్లు బతకాలని లేదా ? తమరికి !

 




 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరెన్సీ నోట్ల పై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతి పరులను ఉద్దేశించి అవినీతి అరికట్టాలంటే  దేశంలో రూ.200 రూ.500 కరెన్సి నోట్లు రద్దు చేయాలన్నారు. గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని కూడ అన్నారు. కరెన్సి స్థానే డిజిటల్ కరెన్సి  తీసుకు రావాలని అన్నారు. మంగళవారం జరిగిన ఎస్ఎల్బిసి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చేసినవో ఊహించుకోవచ్చు. 


  బాబు ఆక్రోషం సరే కాని...నోట్లు  రద్దు చేస్తేనే అవినితి అరికట్టగలమా అనేది ప్రశ్న....నరేంద్ర మోది ప్రధానిగా  మొదటి సారి 2014 లో భాద్యతలు చేపట్టిన తర్వాత 2016 లో హఠాత్తుగా  రూ.500నోట్లు రూ.1000నోట్లు  రద్దు చేసారు.  


దొంగ నోట్లు అరికట్టేందుకని నల్లధనం అరికట్టేందుకని అప్పట్లో దీన్ని సమర్దించిన వారున్నారు. వారిలో చంద్రబాబు నాయుడు కూడ ఉన్నారు. నోట్ల రద్దు ఎంత వరకు నల్ల ధనం అరికట్టగలిగిందో అట్లాగే దొంగ నోట్లను అరికట్టగలిగిందో ఇప్పటి వరకు రిజర్వు బ్యాంకు మాత్రం ఖచ్చితంగా  ప్రకటించ లేదు. 


కాని ఈ నోట్ల రద్దు కాలంలో సామాన్యులు నరకం అనుభవించారు.  చిరు వ్యాపారులు బాగా చితికి పోయారు. ఎదిగే కాలంలో ఉన్న కుటుంబాలు బాగా నష్ట పోయాయి. ఈ నోట్ల రద్దు తదుపరి వచ్చిన కరోనా మహమ్మారి నిరుపేదలను నిండా ముంచేశయి. ఇంకా కోలుకోలేక లక్షలాది నిరుపేద కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 

అవినీతి జలగలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసాడే అనుకుందాం. అధికారంలో ఉన్న వారికి నిజంగా చిత్త శుద్ది ఉంటే అనేక మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం తల్చుకుంటే అవినీతి పరులను ఏరివేయడం పెద్ద పనేం కాదు.  


ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించబట్టే కదా అవినీతి విచ్చలవిడితనంగా పెరిగింది.  దొంగ వ్యాపారాలు దొంగ దందాలను ప్రోత్సహించిందే రాజకీయాలు కదా. నేరుగా రాజకీయరంగంలో నే అవినీతి జలగలు పాతుకు పోయాయి. ఇలా ఈ అంశంపై చాలా నే చర్చించ వచ్చు. 

మీ పగలు ప్రతీకారాలు సరే కాని ముందు సామాన్యుల సంగతి  ఆలోచించండి. ఓవైపు సంక్షేమం అంటూ, మాఫీలంటూ  నగదు బదిలీలు చేస్తూ మరో వైపు సామాన్యుల నడ్డి విరిచే పనులు చేయకండి బాబూ. .... 

మీరిపుడు చాలా పవర్ ఫుల్ పొజిషిన్ లో ఉన్నారు. మీరు వేలు చూపితే ప్రధాన మంత్రి తల ఊప కుండా చేసే  పరిస్థితి ఉంది. ఇలాంటి ఆలోచనలు మదిలో రానీయకండి బాబు అని పేదలు   బాబును వేడుకునే స్థితి రావద్దు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు