ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల లలో మెరుగైన వైద్య సేవలు - మంత్రి దామోదర రాజనర్సింహ

 


ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల లలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన లకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం 

 గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సి ఎస్ ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి .

 ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ప్రాధాన్యత రంగాలైన పేషంట్ కేర్, శానిటేషన్, డైట్, బయో - మెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లై లతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి అవసరమైన సిబ్బంది, విద్య, వైద్య రంగాలతో పాటు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలలో ఫార్మా కంపెనీలు తమ సి ఎస్ ఆర్ ఫండ్స్ ను అందించాలి .

 రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సి ఎస్ ఆర్ విధులను విడుదల చేయడానికి సానుకూల స్పందన . 


రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదు లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతం పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి  సూచనల మేరకు రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల CSR హెడ్స్ తో సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... ఎంతో సుదీర్ఘ చరిత్ర, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఉస్మానియా, గాంధీ అస్పత్రుల పూర్వ వైభవానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మెరుగైన సేవలు అందించుటకు రాష్ట్రంలోనీ ప్రముఖ ఫార్మా కంపెనీలు సామాజిక బాధ్యతగా తమ సి ఎస్ ఆర్ నిధులను కేటాయించాలని మంత్రి కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి,గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం, ఆస్పత్రులలో పరిసరాల పరిశుభ్రత, రోగులకు నాణ్యమైన భోజనం అందించడం, ఆస్పత్రులలో సేవలందించడానికి తగినంత మ్యాన్ పవర్, లాండ్రీ, బయో మెడికల్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలతో పాటు ఎడ్యుకేషన్ & హెల్త్ , బాలికల చదువు లాంటి ప్రాధాన్యత అంశాలలో సి ఎస్ ఆర్ నిధులు విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల CSR ఫండ్స్ విభాగాధిపతులు ఈ వారంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత కలిగిన అంశాలపై టెక్నికల్ గా నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ హ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల లలో రోగులకు అవసరమైన, నాణ్యమైన, మెరుగైన సేవలను అందించేందుకు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరిoటేoడెంట్ లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, ఉస్మానియా ఆస్పత్రి  సూపరిoటేoడెంట్ డాక్టర్ నాగేందర్, గాంధీ ఆసుపత్రి సూపరిoటేoడెంట్ డాక్టర్ రాజారావు, మైలాన్ లాబరేటరీ నుంచి Mrs. మిచెల్లె డొమినికా, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుండి కె రఘురామన్, నాట్కో ఫార్మా నుండి ఎం వంశీకృష్ణ, భారత్ బయో ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుండి ప్రవీణ్, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ నుండి శ్రీనివాస్ రెడ్డి అరబిందో ఫార్మా లిమిటెడ్ నుండి పి హరీష్ బాబు హిట్రో డ్రగ్స్ నుండి ఎం సుధాకర్ - బాయిలజికల్. ఈ లిమిటెడ్ నుండి కృష్ణ చైతన్య, msn లాబరేటరీ నుండి సురేందర్ రెడ్డి, దివిస్ లేబరేటరీ నుండి కే సుబ్బారావు విర్కో డ్రగ్స్ నుండి ప్రవీణ, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుండి లోకేష్ మిడ్ డే లు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు