ముగిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు



 ముగిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్  17 బాల బాలికల బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిసాయి.
  విజేతలకు, రన్నర్‌లకు బహుమతులు అందజేసారు.


బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT- బ్యాట్)కి అనుబంధంగా ఉన్న వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డబ్ల్యుడిబిఎ) *ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్(డబ్లయి డి బి ఎ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్  17 బాల బాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు* ఈ నెల(జూలై) 23 నుండి 26 వరకు స్థానిక వరంగల్ క్లబ్ హనుమకొండ  నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ యువత తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి క్రీడలు దోహద పడతా యన్నారు.
యువత డ్రగ్స్,  ఆల్కహాల్ లేదా మొబైల్ ఫోన్‌లకు బానిస కాకుండా ఉత్తమ పద్ధతులను అవలంబించాలన్నారు .
విజేతలను అభినందించి టోర్నీని విజయవంతం చేయడంలో నిర్వాహకుల కృషిని కొనియాడారు. యువతలో ఐక్యత, క్రమశిక్షణ, శారీరక శ్రేయస్సు పెంపొందించడంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. గెలవడం మరియు ఓడిపోవడం ముఖ్యం కాదని  చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యమన్నారు.



ఈ సందర్భంగా డబ్ల్యూడీబీఏ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.రమేష్‌ కుమార్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు  అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు టోర్నమెంట్ వేదికగా మారిందన్నారు.  బాగా ఆడిన క్రీడా కారులకు నగదు బహుమతులను  ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ కార్యదర్శి శ్రీ పి.రవీందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్, ఏసీపీ- జాయింట్ సెక్రటరీ- బ్యాట్ ,  డా.ఎం జితేందర్ రెడ్డి, డబ్ల్యుడిబిఎ   జనరల్ సెక్రటరీ,  కిట్స్ వరంగల్   అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. పింగిలి. రమేష్ రెడ్డి, శోభన్ కుమార్, నరేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి,నాగ కిషన్, వద్దిరాజు వెంకన్న, సంతోష్ రెడ్డి,రాజ్ కుమార్ అగర్వాల్, మోహన్ రావు, వైకుంఠం, రాజేందర్, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, వరంగల్ క్లబ్ కమిటీ సభ్యులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు