అండర్ 17 బాడ్మింటన్ పోటీలు జులై 23 నుండి 26 వరకు




ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్(డబ్లయి డి బి ఎ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ ఏజ్ 17 ఇయర్స్ బాల బాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు* ఈ నెల(జూలై) 23 నుండి 26 వరకు స్థానిక వరంగల్ క్లబ్ హనుమకొండ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ బడుతాయి అని డబ్లయి డి బి ఎ సెక్రటరీ డా పి రమేష్ రెడ్డి తెలిపారు.  23 రోజు పోటీలు కిట్స్ ఇండోర్ స్టేడియంలో కూడా నిర్వహించ బడును. ఈ పోటీలలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు కేరళ రాష్ట్రం లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు.

ఈ చాంపియన్షిప్ లో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుండి 250 మంది క్రీడాకారులు వస్తున్నారు. పోటీల నిర్వహణకు 15 టెక్నికల్ ఆఫీసియల్స్ ను నియమించడం జరిగింది.

పోటీల ప్రారంభానికి అతిథులు గా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి నంద గోపాల్ మరియు విద్యాదర్ వచ్చి క్రీడా కారుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

చాంపియన్షిప్ ఓపెనింగ్ సెర్ మోనీ జూలై 24 వ తేది ఉదయం 9 గంటలకు వరంగల్ క్లబ్ నందు జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో వరంగల్ క్లబ్ సెక్రటరీ ఏం. రవీందర్ రెడ్డి గారు పాల్గొంటారు. అదే విధంగా ఎస్. రమేష్ కుమార్, జితేందర్ రెడ్డి, శోభన్ కుమార్, నరేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి,నాగ కిషన్, వద్దిరాజు వెంకన్న, సంతోష్ రెడ్డి,రాజ్ కుమార్ అగర్వాల్, మోహన్ రావు, వైకుంఠం, విటి.ప్రసాద్, రాజేందర్, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, వరంగల్ క్లబ్ కమిటీ సభ్యులు మరియు ఇతర సభ్యులు పాల్గొంటారు.

బహుమతి ప్రధాన కార్యక్రమం జూలై 26 వ తేది సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ క్లబ్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ. అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు అతిథులు గా పాల్గొంటారు. అంతే కాకుండా క్లబ్ సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు విశిష్ట అతిథి గా పాల్గొంటారు మరియు పైన పేర్కొన్న వారు అందరూ పాల్గొంటారు.

క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుంది.

ఇట్లు

Dr. రమేష్ కుమార్ ప్రెసిడెంట్ 

Dr. రమేష్ రెడ్డి సెక్రటరీ 

నాగ కిషన్ కోశాధికారి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు