కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్ షిప్ ఏర్పాటుకు వేగవంతం గా చర్యలు : జిల్లా కలెక్టర్, పరకాల, వర్ధన్నపేట శాసనసభ్యులు
జాతీయ రహదారులు, ఎయిర్ పోర్ట్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి మానవీయ కోణంలో అధిక పరిహారం అందించాలి.
సంభందిత అధికారులతో సమీక్ష.
వరంగల్, 11 జులై 2024:కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్ షిప్ ఏర్పాటుకు వేగవంతం గా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పరకాల,వర్ధన్నపేట శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కె ఆర్ నాగరాజు లు ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పరకాల, వర్ధన్నపేట శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి కె ఆర్ నాగరాజు లు ఎయిర్పోర్ట్ భూసేకరణ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జాతీయ రహదారులకు భూ సేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మామునూరు ఎయిర్పోర్ట్, ఎన్ హెచ్ ఏ ఐ భూ సేకరణ పై సమీక్షిస్తూ
ఇటీవల ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూములు కోల్పోతున్న రైతులతో మానవీయత కోణంలో వ్యవహరించి అధిక ధర చెల్లించాలని కోరిన మేరకు
శాశ్వతంగా భూములు కోల్పోతున్న వారి గురించి మానవత దృక్పథంతో సాధ్యసాధ్యాలను పరిశీలించి
వారికి పరిహారం గరిష్ట స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజులు సూచించారు.
గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్బిట్రేషన్ల ద్వారా భూ నిర్వాసితులతో చర్చించి అధిక ధరలు చెల్లించేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు భూముల అప్పజెప్పిన నిర్వాసితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఆదేశించిన విధంగా టౌన్షిప్ ఏర్పాటు చేసి అందులో అవసరమైన మౌలిక సదుపాయాలైన పాఠశాల, కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సోమవారం సాయంత్రం కల్లా సిద్ధం చేసి సమర్పించాలని, అదేవిధంగా కాంటూరు మ్యాప్ లను కూడా సిద్ధం చేసి సమర్పించాలని ఇరిగేషన్, టిజిఐఐసి అధికారులను
రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఆడియో కృష్ణవేణి, ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గ ప్రసాద్ ,
టిజిఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, ఈ ఈ సునీత, జిల్లా ఆర్ అండ్ బి అధికారి జితేందర్, రెడ్డి ఎయిర్పోర్ట్ అధికారులు తులసి, నటరాజ్, తహసీల్దార్లు
రియాజుద్దీన్, వెంకటస్వామి, రాజ్ కుమార్, ఇరిగేషన్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box