బుధవారం ప్రజాభవన్ లో ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటి సిఎం చీఫ్
చీఫ్ సెక్రెటరి శాంతి కుమారి
హైదరాబాద్, జూలై 03:: ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు. సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట రావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
------ends
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box