సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుటకు అభ్యంతరాల స్వీకరణ :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

 


సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుటకు  అభ్యంతరాల స్వీకరణ :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

అభ్యంతరాలు, సూచనలుంటే బుదవారం నిర్వహించే ప్రత్యేక గ్రామ సభల ద్వారా తెలియజేయవచ్చు.

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రతిపాదనల మేరకు సమ్మక్క- సారలమ్మ ములుగు జిల్లాగా, జిల్లా పేరు మార్చుటకు  అభ్యంతరాల స్వీకరణకు నోటీస్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పేరును సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మారుస్తూ పబ్లిక్ నోటీస్ జారీ చేయడం జరిగిందని జిల్లా పేరు మార్చడం పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బుదవారం గ్రామాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే గ్రామ సభల ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సాంకేతిక సమస్యల కారణంగా మల్లంపల్లి మండల ఏర్పాటుకు ఆలస్యం అవుతుంది :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

   

**సాంకేతిక సమస్యల కారణంగా మల్లంపల్లి మండల ఏర్పాటుకు ఆలస్యం


కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మల్లంపల్లి మండల ఏర్పాటుకు ఆలస్యం అవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మల్లంపల్లి మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 23.09.2023 తేదీన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 331/ 2023  ద్వారా జారీ చేసియున్నారు. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడానికి శాయంపేట మండలం లోని కొన్ని గ్రామాలు అభ్యంతరాలు తెలపడం తో మండల ఏర్పాటు ఆలస్యం అవుతుందని, అదేవిధంగా 

ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను విలీనం  చేస్తూ మున్సిపాలిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని ఈ ఫైల్ గవర్నర్ వద్ద ఉందని అయన తెలిపారు.


ఈ సమస్యల పై  ఉన్నత అధికారుల దృష్టికి, స్థానిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు