మాకొద్దీ తె(న)ల్లదొరతనం!



 *_మాకొద్దీ తె(న)ల్లదొరతనం!_*

______________________

_తొలి జాతీయ తెలుగు కవి_

_గరిమెళ్ళ జయంతి.._

      14.07.1893

************************

(*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*)

       9948546286

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

_మాకొద్దీ తెల్లదొరతనం దేవ_

_మాకొద్దీ తెల్లదొరతనం.._

_మా ప్రాణాలపై పొంచి ఉండి_

_మానాల హరియించే_

_మాకొద్దీ తెల్లదొరతనం..!_


_పన్నెండు దేశాలు_ _పండుచున్నా గాని_

_పట్టెడన్నమే లోపమండి_

_ఉప్పు ముట్టుకుంటే_ _దోసమండి.._

_నోట మట్టి గొట్టి పోతడండి_

_కుక్కలతో పోరాడి_ 

_కూడు తింటామండి..!_


_ధనము కోసం వాడు_ 

_దారి చేసికొని_

_కల్లు సారాయి అమ్ముతాడు_

_మాదు మూట ముల్లెయు దోచుతాడు.._

_ఆలి మెళ్లో పూసలు తెంచుతాడు.._

_మా కంట్లో దుమ్మేసాడు.._

_కాటి దరికి చేర్చాడు..!_


ఇది గరిమెళ్ళ ఆవేశమే కాదు

బానిసత్వమే తత్వమై

విశృంఖల విధానాల

శృంఖలాల నడుమ నలిగిపోయిన 

భరతజాతి ఏకత్వం..

ఉద్యమమే

విముక్తిమార్గమని 

నమ్మిన జనం 

ప్రభంజనమయ్యేలా

తిరుగుబాటుకు పురిగొల్పిన

నాటి జాతీయ గేయమది..

ప్రతి తెలుగోడి మదిని

ఉరకలెత్తించిన గీతమై..

భారతీయుడి మనోగతమై..!


_గాంధీ టోపీ పెట్టి_ _పాఠశాలలకు_ 

_రావద్దు రావద్దంటాడు.._r

_రాట్నం బడిలో పెట్టావద్దంటాడు.._

_టోపీ తీసి_ 

_వీపులు బాదుతాడు..._

_రాజద్రోహమంతా_

_రాట్నంలో యున్నదట..!_

బ్రిటీషోడి దురాగత పాలనను ఎండగట్టి

భరతజాతిని 

జాగృతం చేసిన 

గరిమెళ్ళ జైలుకెళ్ల..

ఇదే గేయం మనకి ప్రియమై

భాష అర్థం కాకపోయినా

ఆత్మ అవగతమైన

కలెక్టరు బ్రేకనుకు

కర్ణ ప్రేయమై..

కవికి సంకెళ్లు..

జనం ఆవేశం మాత్రం 

అదే పరవళ్ళు..!


కటకటాల నడుమ కటకటలాడినా..

నాన్న ఇక లేడనే

కబురే తెలిసినా..

క్షమాభిక్ష కోరితే పంపుతానంది 

తెల్లోడి అధికార అహంకారం

కోరనే కోరనంది

దేశభక్తుని ధిక్కారం..!


విభజించి పాలించు

అన్నది తెల్లోడి నీతియని..

భారతీయుల అనైక్యతే 

అతగాడి బలమని ఎరిగి

రక్తం మరిగి అక్షర జ్వాలలు ఎగసి తిరుగుబాటు గేయాలు

రాసినా జరుగుబాటు 

కరవైన గరిమెళ్ళ..

నల్లదొరల ఏలుబడిలో

యాచకుడైతే ఆదుకునే

యోచన చేయని దుస్థితిలో

దరిద్రంలో మగ్గి

అసువులు బాసినాడు..

తెల్లోడి అకృత్యాలపై

అలుపెరుగని

అక్షరాల జైత్రయాత్ర 

సాగించిన విప్లవమూర్తిఈ

అంతిమయాత్ర చందాలతో

ముగిసిన దుస్థితి అదేమి..

సిగ్గు సిగ్గు..

మాకొద్దీ నల్లదొరతనం..

అనకపోయినా 

మారాలీ దొంగతనం..

ఉన్నప్పుడు లెక్కచేయక..

పోయినాక హారతి పట్టే

ఈ పాలకుల నిరతి..!


గరిమెళ్ళ కవీ..

అస్తమించని రవీ..

నువ్వు కలత పడినా

నీ కలం నిలిచి ఉండదా

కలకాలం..!

నీ గీతాలు 

మా గతమై

అవగతమై..!!


************************

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు