ఎడారి బతుకులను హృద్యంగా తెరకెక్కించిన సినిమా 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్)

 


ఎడారి బతుకులను హృద్యంగా తెరకెక్కించిన సినిమా  'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్)


        నెట్‌ ఫ్లిక్స్ లో 'ఆడు జీవితం' (గోట్ లైఫ్) అనే సినిమా (మలయాళం మాతృక ) ను ఏదో కొద్దిగా చూద్దామని ప్రారంభిస్తే, అది పూర్తిగా అయిపోయే వరకు రాత్రి రెండున్నర వరకు మొత్తం వదలకుండా చూసాను. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్) అద్భుతంగా ఉంది. 

 బెన్యామిన్ రాసిన  'ఆడుజీవితం' (Aadujeevitham) అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈనవల దాదాపు రెండు లక్షల కాపీలు అమ్ముడు పోవడంతో పాటు పలు భాషల్లో అనువాదం కూడా జరిగింది. దీనిని ఇటీవలే స్వర్ణ కిలారి అనే రచయిత్రి కూడా తెలుగులోకి అనువదించి మేక జీవితం అనే పేరుతొ విడుదలచేశారు. 

        ‘ఆడు జీవితం’ పేరుతో రాసిన ఈ కథ కేరళ నుంచి సౌదీ ఆరేబియాకు వలస వెళ్ళిన నజీబ్ మహమ్మద్ నిజ జీవిత కథ.  మలయాళ స్టార్ హీరోస్ లో ఒకరైన టాలెంటెడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన రీసెంట్ చిత్రాల్లో ఒకటే “గోట్ లైఫ్ – ఆడు జీవితం” . పృద్వి నటన ఆస్కార్ లెవల్ లో ఉంది.

           గల్ఫ్ ఏజెంట్ల మాటలునమ్మి మోసపోయి అరేబియా ఎడారిలో నిర్భందం మద్య గొర్రెలకాపరిగా అనేక కష్టాలు పడుతూ నాలుగేళ్ల పాటు నరకయాతన అనుభవించిన అభాగ్యుని  కథ. సినిమా అంతా ఎడారిలో మూడునాలుగు పాత్రల మద్య జరుగుతుంది. 

పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రమ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. యువనటుడు గోకుల్ గుర్తుండిపోయే హకీం పాత్రలో నటించారు. హైతీ నటుడు జిమ్మీ జీన్ లూయిస్,  ఇబ్రహీం ఖాద్రి పాత్ర చేయడంతో  పాటు ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు. సంగీత దర్శకులు ఏ. ఆర్. రహమాన్ సంగీతం హైటెల్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా, హీరోయిన్అమలా పాల్ తో హీరో పృద్విరాజ్ నీటిలో (వాగులో ) తీసిన రొమాంటిక్ సాంగ్ సూపర్ గా ఉంటుంది.

ఎడారి దృశ్యాలు, ఎడారిలో యజమానులుగా పిలిచే హకీమ్ లు పెట్టె బాధలు, నీటిలోపల నుండి ఇసుకను తవ్వడం తదితర సీన్ లను అద్భుతంగా తెరకెక్కించారు. అయితే, ఎడారిలో హీరో పడే బాధలు, కాఫిర్ నుండి తప్పించుకునే దృశ్యాల చిత్రీకరించడంలో సన్నివేశాలు కొద్దిగా సాగదీత గా ఉన్నప్పటికీ హీరో పడే బాధను మనమే అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. అసలు, మనమే ఎడారిలో చిక్కుకుపోయామా అనేరీతిలో  అద్భుతంగా ఉంటుంది.

         రాబందులు శవాన్ని పీక్కుతినడం, ఇసుకలో విష సర్పాలు రావడం, ఇసుక తుఫానులు రావడం లాంటి సంఘటనలు మననుగగుర్పాటుకు గురిచేస్తాయి కూడా.  మొత్తానికి, ఇటీవలి కాలంలో మంచి సినిమాలంటేనే, మలయాళం సినిమాలు అన్న భావనకు మరో ఉదాహరణ ఈ సినిమా అని చెప్పవచ్చు. చూస్తే గాని ఈ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేం.

------

     

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు