పారా అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే క్రీడా ప్రాంగణంలో జరిగిన సమావేశంలో వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న పారా అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణను గుర్తించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉత్తర్వులు ఇవ్వడానికి కారకులైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ముత్తినేనీ వీరయ్య ధన్యవాదాలు తెలిపారు.
సికింద్రాబాద్ లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో జరిగిన మొదటి జూనియర్స్, సబ్ జూనియర్స్ పారా అథ్లెటిక్ చాంపియన్ షిప్ -2024 ను వీరయ్య ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వము పారా క్రీడలను నిర్లక్ష్యము చేసిందని, ఎన్ని సార్లు అడిగినా పారా విభాగము ఎర్పాటు చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడగానే తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని మార్చి 18 న వికలాంగ క్రీడలను ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ వారు క్రీడల్లో పారా క్రీడలను చేర్చుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో పారా అథ్లెట్ల కి రేవంత్ రెడ్డి దిక్సూచి గా మారారని అన్నారు. రాబోయే కాలంలో వికలాంగులు క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో అధ్యయనం చేసి అక్కడి కంటే మెరుగ్గా ఇక్కడ చర్యలు చేపట్టేలా ప్రయత్నం చేస్తా అన్నారు. మన అసోసియేషన్ మెంబర్ అయినా జీవన్ జీ దీప్తి పారా వరల్డ్ చాంపియన్ షిప్ లో & ఏసియన్ పారా అథ్లెటిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచి వరల్డ్ రికార్డు సైతం నమోదు చేయటం తో పాటు ఆగస్టులో ఒలింపిక్ పారా క్రీడలలో పాల్గొన బోతున్నందుకు మన రాష్ట్రానికి, దేశానికి గర్వ కారణమన్నారు.
ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింగారపు బాబు, జనరల్ సెక్రటరీ గాడిపల్లి ప్రశాంత్, వీల్ చైర్ ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కొచ్ సైదులు, మరో పారా క్రికెట్ ఇండియా కోచ్ చంద్రబాన్ గిరి, హెలెన్ కిల్లర్ విద్యాసంస్థల చైర్మన్ ఉమర్ ఖాన్, సంఘము సలహాదారు తలారి సంజీవయ్య, ట్రెజరరీ నూక రాజు, రాగుల నరేష్ యాదవ్, దామరుప్పల రమాదేవి, చల్ల పవన్, దీరావత్ మహేష్, ఎన్ ఐ ఎస్ కోచ్ కబీర్ దాస్ తదితరులు పాల్గోన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box