చంద్రబాబు విజయంతో పంతం వీడి పుట్టింట అడుగు పెట్టిన ఓ వీరాభిమాని



 రాజకీయ విభేదాలు కుటుంబాలలో చొరబడి మనుషులను విడదీస్తున్నాయి. ఎవరి మనోభావాలు వారికి ఉండడం సహజం కాని ఈ కాలంలో రాజకీయాలు ఇంటింటి తలుపు తట్టడమే కాదు ప్రతి  మనిషి జీవితంలో భాగమయ్యాయి.

జగనే గెలుస్తాడని కాదు బాబే గెలుస్తాడని వాదనలకు వెళ్లి ఓ తెలుగింటి ఆడపడుచు ఏకంగా ఐదేళ్లు పుట్టింటికి దూరమయ్యారు. 2019 లో బాబు గెలుస్తాడని తాను చెప్పిన మాట నిజం కాక పోవడంతో ఐదేళ్ళ వరకు పుట్టింటి ముఖం చూడ లేదు. చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంతోషంతో పుట్టింట్లో అడుపెట్టారు.

 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో జరిగిన ఈ ఉదంతం వైరల్ గా మారింది.  ఈ గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ  నాలుగో కూతురు విజయలక్ష్మి కి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావు తో వివాహం జరిగింది. తల్లి దండ్రులు కాలం చేసినా పుట్టింట్లో తన సోదరి ఉంటున్నారు. పుట్టింట్లో ఉన్న సమయంలో తన సోదరి కుమారుడితో విజయలక్ష్మి రాజకీయ వాదనకు దిగింది. తన వాదనల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తాడని  చెప్పింది. అయితే జగనే గెలుస్తాడని అక్క కుమారుడు వాదించాడు. ఎన్నికల్లో జగన్ గెలవడంతో విజయలక్ష్మి తీవ్ర మనస్థాపం చెంది ఇక పుట్టింటి ముఖం చూడనంటూ భీష్మించింది. అన్న మాట ప్రకారం పండగలకు, ఇతర శుభ కార్యాలకు పుట్టింటికి వెళ్ల లేదు. అంతటి పట్టింపులు కూడదంటూ బందువులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా విజయ లక్ష్మి  అంగీకరించ లేదు. చంద్రబాబు గెలిచిన తర్వాతే పుట్టింట్లో అడుగు పెడతానంటూ భీష్మించుకుంది. ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయంసాధించన తర్వాత విజయలక్ష్మి  తన పంతం వీడారు. విజయ దరహాసంతో పుట్టింటికి వచ్చి భందువులతో సంతోషం పంచుకున్నారు. గ్రామంలో అడుగు పెట్టిన తర్వాత తొలుత ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.  విజయలక్తాష్నుమికి గ్రామస్తులు భందువులు ఘన స్వాగతం పలికారు. తాను మొదటి నుండి తెలుగుదేసం పార్టీకి చంద్రబాబు నాయుడుకు వీరాభిమానినని జగన్ గెలవడం తనకు ఇష్టం లేదని అన్నారు. జగన్ ఎన్ని ఇ్బబందులు పెట్టినా చంద్రబాబు విజయాన్ని ఆపలేక పోయారని అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు