పర్యాటక రంగంలో ములుగు జిల్లా అగ్రగామిగా నిలవాలి -కలెక్టర్ దివాకర టి.ఎస్

 



పర్యాటక రంగంలో  ములుగు జిల్లా అగ్రగామిగా నిలిపేందుకుప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు.

 యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం అయిన రామప్ప ఆలయంతో పాటు కాకతీయల కాలం నాటి అనేక కట్టడాలు, సరస్సులు సెలఏర్లతో ప్రకృతి సోయగాలకు నిలయమైన ములుగు జిల్లాను ప్రముఖ పర్యాటక జిల్లాగా తీర్చి దిద్దాలని  జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన దివాకర టి.ఎస్ సంకల్పించారు.


 ఇందు కోసం జిల్గా స్థాయి అధికారులతో టూరిజం మేనేజ్ మెంట్ కమిటి ఏర్పాటు చేసారు. ములుగు జల్లాకు పర్యాటకుల సందడి రోజు రోజుకూ పెరుగుతోంది.  పర్యాటక ప్రాంతాలలో చేపట్టాల్సిన మౌలిక వసతులతో పాటు అవసరమైన ఇతర అభివృద్ది పనుల కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  

గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లాలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు  జిల్లా టూరిజం మేనేజ్ మెంట్ కమిటీ   అధికారులతో చర్చించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టమ్మ దేవాలయం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, లక్నవరం, తాడ్వాయి లోని బ్లాక్ బెర్రీ ఐలాండ్, బొగత జలపాతం, మల్లూరు దేవాలయం, కిన్నెరసాని మొదలయ్యే పాయింట్ అయిన  లవ్వాల, ట్రెక్కింగ్ ప్రదేశాలు జిల్లాలో ఉన్న ఇతర ఆకర్ష నీయ  స్థలాలను గుర్తించి అభివృద్ది చేయాలన్నారు. 

జిల్లాలో ఉన్న టూరిజం స్థలాల రూట్ మ్యాప్ ను కమిటి తయారు చేయాలని అన్నారు. అధికారులు సమన్వయంతో కొత్త ఆలోచనలతో పర్యాటకులను మరింతగా ఆకర్షించే రీతిలో  15 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సమావేశం లో  డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్యా పాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, పి ఆర్ ఈ ఈ అజయ్ కుమార్, 

నీటి పారుదల శాఖ ఈ ఈ  నారాయణ,  కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, సూపర్ ఇండెంట్ శివ కుమార్, డిప్యూటీ ఎస్ ఓ లక్ష్మినారాయణ, టూరిజం ఏ ఈ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

---ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు